»   » యాంకర్ సుమ డాన్స్ చూసారా???: జిమ్మి కి కమ్మల్ అంటూ దుమ్ము రేపేసింది

యాంకర్ సుమ డాన్స్ చూసారా???: జిమ్మి కి కమ్మల్ అంటూ దుమ్ము రేపేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Suma Dances For Jimiki Kammal Song యాంకర్ సుమ డాన్స్ చూసారా?

"వెలిపడింతె పుస్తకం" మోహన్ లాల్ హీరోగా మళయాళం లో వస్తున్న ఈ చిత్రంలోని 'జిమ్మిక్కి కమ్మల్‌' అనే పాట ఇటీవలే విడుదలైంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్.పిచ్చిపట్టినట్టు చూసేస్తూనే ఉన్నారు. ఇప్పుడు యూత్ లో కూడా ఈ పాట యమా పాపులర్ అయిపోయింది.ఒరిజినల్ సాంగ్ సంగతేమో గానీ ఆ పాటకి ఈ మధ్య ఓనం సంధర్భగా ఒక కాలేజ్ లో చేసిన డాన్స్ ఏకంగా యూట్యూబ్ ట్రెండ్ గా మారింది.

ఓనం సంప్రదాయ దుస్తులు

ఓనం సంప్రదాయ దుస్తులు

ఓనం సంప్రదాయ దుస్తులు ధరించి వారు చేసిన డ్యాన్స్‌ యువతకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా షెరిల్‌ అనే అమ్మాయి డ్యాన్స్‌కి బాగా పేరొచ్చింది. రెండు వారాలకు ముందే ఆమె ఆ కళాశాలలో చేరింది. ఓనం పండుగకి ఏదైనా భిన్నమైన వీడియోను రూపొందించాలని భావించి అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ‘జిమ్మికి కమ్మల్‌' వీడియోకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడ‌ది యూట్యూబ్‌ను ఊపేస్తుంది.

వైరల్‌గా మారింది

వైరల్‌గా మారింది

కోటికి పైగా వ్యూస్ దాటిపోయింది. మలయాళుల సుప్రసిద్ధ పండుగ ఓనంకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ కామర్స్‌ కళాశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు డాన్స్‌ చేసిన ఈవీడియో ఆన్‌లైన్‌లో విపరీతమైన వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఏకంగా కోటి 18 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

అమెరిక‌న్ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మి కిమెల్‌

అమెరిక‌న్ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మి కిమెల్‌

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ పట భార‌తీయులనే కాదు...ఇత‌ర‌దేశ‌స్థుల‌నూ ఆక‌ర్షిస్తోంది. జిమ్మిక్కి క‌మ్మ‌ల్ అంటూ సాగే ఈ పాట ప్ర‌ముఖ అమెరిక‌న్ టెలివిజ‌న్ హోస్ట్ జిమ్మి కిమెల్‌కు కూడా చాలా న‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలియ‌జేశారు.

జిమ్మి కిమెల్

జిమ్మి కిమెల్

జిమ్మిక్కి క‌మ్మ‌ల్ చ‌ర‌ణాలు త‌న పేరు జిమ్మి కిమెల్ ను త‌ల‌పిస్తుండ‌టంతో పాట ఆసాంతం ఆస‌క్తిగా విన్నాన‌ని జిమ్మి చెప్పారు. చ‌ర‌ణాలు అర్ధం కాక‌పోయినాపాట త‌న‌కు చాలా న‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే జిమ్మీ చేసిన ట్వీట్ కి కూడా అంత గుర్తింపురాలేదు గానీ మన యాంకర్ సుమ ఈ పాటని ఇప్పుడు తెలుగులోనూ పాపులర్ చేసేసింది.

సెరిల్ డ్యాన్స్‌కు యాంకర్ సుమ పోటీ

సెరిల్ డ్యాన్స్‌కు యాంకర్ సుమ పోటీ

స్టార్ యాంకర్ సుమ స్టెప్పులేశారు. కేరళలో పెట్టిపెరిగిన సుమ.. ఓనం స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం తెలుగు వాళ్లను బాగా ఆకట్టుకుంటోంది. సెరిల్ డ్యాన్స్‌కు యాంకర్ సుమ పోటీ ఇస్తోంది. ‘జిమ్మికి కమ్మల్' అంటూ సాగే ఆ పాటకు సుమ తన చెవి కమ్మలను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోంది.

బాగా పాపులర్ అయిపోయింది

ఈ పాట తనను కూడా ఉర్రూతలూగిస్తోందంటూ సుమ చెప్పుకొచ్చారు. కోటికి పైగా వ్యూవ్స్ దాటిన ‘జిమ్మికి కమ్మల్‌' పాటకు సుమ స్టెప్పులేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘వెలిపండితే పస్తకం' సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ఇలా బాగా పాపులర్ అయిపోయింది. ఈ పాటను అనిల్ పనచూరన్ రాయగా వినీత్ శ్రీనివాసన్, రెంజిత్ ఉన్ని పాడారు. షాన్ రహ్మాన్ ఈ పాటకు సంగీతాన్ని అందించారు.

English summary
The famous Telugu anchor Suma also dances for Jimiki Kammal song which became viral. Suma shared this video on her Facebook page by posting this song made her insane.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu