twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫీల్ గుడ్ ప్రేమ కథ ('అందాల రాక్షసి' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి నిర్మాతగా మారి రూపొందించిన 'అందాల రాక్షసి' ఈ రోజు విడుదల అవుతోంది. హనురాఘవపూడి దర్శకుడుగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రం ప్రోమోలు,పోస్టర్లలతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నవీన్‌చంద్ర రాహుల్, లావణ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఎస్.ఎస్.రాజవౌళి మాట్లాడుతూ చిత్రంపై నమ్మకంతోనే తాను నిర్మాతగా మారానని, నిర్మాతగా మారడానికి దర్శకుడు హను రాఘవపూడి కూడా ఓ కారణమని, నిర్మాతపై నమ్మకంతోనే తానీ చిత్రానికి కొంత షేర్ కలిశానని తెలిపారు.

    కథ విషయానికి వస్తే...సూర్య (నవీన్‌) అందరికీ మంచి చేయాలనుకొనే యువకుడు. జీవితాన్ని సాఫీగా గడిపేస్తుంటాడు. అతని జీవితంలోకి మిథున (లావణ్య) ప్రవేశిస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుండగా... మధ్యలో గౌతమ్‌ (రాహుల్‌) దూసుకొస్తాడు. ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది? ఎవరి ప్రేమ గెలిచింది? అనే విషయాలు తెరపైనే చూడాలి. దర్శకుడు మాట్లాడుతూ ''సూర్యుడు, చంద్రుడు, భూమి... వీటిని ముగ్గురు వ్యక్తులకు ముడిపెడుతూ రాసుకొన్న ప్రేమకథ ఇది. ప్రేక్షకుల్ని ఇరవై ఏళ్ల కిందటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రేమ తప్ప ఈ కథలో మరేం కనిపించదు. ప్రతినాయక పాత్రలు లేనేలేవు. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది''అన్నారు.

    అలాగే ఎవరి అనుమతీ అవసరం లేదన్నట్టుగా... ఉదయం వాకిలి తీయగానే ఇంట్లోకి చొరబడతాడు సూర్యుడు. వెలుగుని పంచుతాడు. అచ్చం అలాంటి మనస్తత్వమే ఉన్న యువకుడు సూర్య. నలుగురికి సంతోషాన్ని పంచిపెట్టడంలోనే తన ఆనందాన్ని వెదుక్కొంటాడు. అందరూ వృథా అన్న వస్తువుకు కూడా ప్రాణం పోస్తాడు. అలాంటి యువకుడి జీవితంలోకి ఓ అందాల భామ వస్తుంది. మరి ఆ అమ్మాయిని రాక్షసి అని ఎందుకన్నాడో తెరమీదే చూడాలి. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

    సంస్థ: వారాహి చలనచిత్రం
    నటీనటులు: నవీన్‌ చంద్ర, రాహుల్‌, లావణ్య, ప్రగతి, సీవీఎల్‌ తదితరులు
    సంగీతం: రధన్‌
    నిర్మాతలు: సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి
    ఛాయాగ్రహణం: జి.మురళి
    దర్శకత్వం: హను రాఘవపూడి
    విడుదల: శుక్రవారం.

    English summary
    Andala Rakshasi is a triangle love story which is set in the 90′s back drop and shot very aesthetically. Hanu Raghavapudi is the director of the movie and this is his debut film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X