twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కి పండగ లాంటి వార్త.. రేట్ల పెంపు జీవో వచ్చేసింది.. బెనిఫిట్‌షో సహా పెద్ద సినిమాలకు మరో భారీ ఊరట!

    |

    తెలుగు సినీ పరిశ్రమ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. వకీల్ సాబ్ సినిమా సమయంలో ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ నుంచి అనేక విమర్శలు, విజ్ఞప్తులు ఎదుర్కొన్న అనంతరం ఎట్టకేలకు రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.. తాజాగా దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

    తాజా జీవోలో టికెట్ రేట్లు పెంపు సహా భారీ బడ్జెట్ సినిమాలకు రేట్ల ప్రేమించుకునే అవకాశం కూడా కల్పించారు. అలాగే బెనిఫిట్ షోలు కూడా వేసుకునే అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం రేట్లు అలాగే ఇతర సౌలభ్యాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    మూడు కేటగిరీలుగా

    మూడు కేటగిరీలుగా

    గతంలో 5 రూపాయల టికెట్లు కూడా ఏపీలో అందుబాటులోకి రావడంతో ఈ టికెట్ రేట్లతో సినిమా ధియేటర్లను నడపలేమని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నటీనటులు సహా సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేయడమే కాక కొంత మంది విమర్శలు కూడా చేశారు అనేక సమావేశాలు, భేటీలు అనంతరం తాజా జీవో విడుదల అయింది.

    ఆంధ్ర ప్రదేశ్ జిఓ నెంబర్ 13 ప్రకారం మొత్తంగా మూడు రకాలుగా థియేటర్ ప్రాంతాలను విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీ -గ్రామ పంచాయతీ అనే మూడు కేటగిరీలుగా విభజించారు.

    మున్సిపల్ కార్పొరేషన్ లో

    ఇక మున్సిపల్ కార్పొరేషన్ లో నాన్ ఏసీ నాన్ ప్రీమియం టికెట్ ధర 40 రూపాయలు, ప్రీమియం టికెట్ ధర 60 రూపాయలు. ఏసీ నాన్ ప్రీమియం ధర 70 రూపాయలు ఏసి ప్రీమియం ధర వంద రూపాయలు. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం వంద రూపాయలు, ప్రీమియం 125 రూపాయలు. అలాగే మల్టీప్లెక్స్ లో రెగ్యులర్ సీట్లు అయితే 150 రూపాయలు సీట్లు రిక్లైనర్ సీట్లు అయితే 250 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.

    అదేవిధంగా మున్సిపాలిటీ కూడా నాన్ ఏసీ నాన్ ప్రీమియం 30 రూపాయలు ప్రీమియం ₹50, ఏసీ నాన్ ప్రీమియం 60 రూపాయలు ఏసి ప్రీమియం 80 రూపాయలు. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం 80 రూపాయలు ప్రీమియం వంద రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మల్టీప్లెక్స్ లో రెగ్యులర్ సీట్లు అయితే 110 రూపాయలు రిక్లైనర్ సీట్లు అయితే 250 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.

    నగర పంచాయతీలు- గ్రామపంచాయతీలు

    నగర పంచాయతీలు- గ్రామపంచాయతీలు

    అలాగే నగర పంచాయతీలు- గ్రామపంచాయతీలు విషయానికి వస్తే నాన్ ఏసీ నాన్ ప్రీమియం 20 రూపాయలు ప్రీమియం 40 రూపాయలు. ఏసి నాన్ ప్రీమియం ₹50, ప్రీమియం 70 రూపాయలు. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం 70 రూపాయలు ప్రీమియం 90 రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మల్టీప్లెక్స్ లు గనుక ఉంటే రెగ్యులర్ సీట్లలో అయితే వంద రూపాయలు రిక్లైనర్ సీట్లు ఉంటే కనుక రెండు వందల యాభై రూపాయలు వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రేట్లు అన్నీ కూడా జీఎస్టీ కలపకుండా మిగతా అన్ని మెయింటెనెన్స్ చార్జీలు కలిపి తీసుకోవాలని పేర్కొన్నారు.

    చిన్న సినిమా ఉండాల్సిందే

    చిన్న సినిమా ఉండాల్సిందే

    అలాగే ప్రతి థియేటర్ లో పాతిక శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీ కింద కచ్చితంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఉన్న సీట్ల సంఖ్యలో పాతిక శాతం సీట్లు కచ్చితంగా నాన్ ప్రీమియం కేటగిరీ కింద అమ్మాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. అలాగే థియేటర్లలో రోజుకు ఐదు సార్లు వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

    అయితే పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో చిన్న సినిమాలు విడుదల అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు ఏదో ఒక ఆటలో చిన్న సినిమా వేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పండుగ పూట అయినా ఒక షో చిన్న సినిమా వేయాల్సిందేనని ఎంత భారీ బడ్జెట్ సినిమా ఉన్నా సరే కచ్చితంగా ఒక చిన్న సినిమా ఆడించాలని పేర్కొన్నారు. చిన్న సినిమా అంటే నటీనటులు రెమ్యూనరేషన్ తో కలిపి ఇరవై కోట్ల లోపు ఉన్న దాన్ని చిన్న సినిమాగా పరిగణించాలని పేర్కొన్నారు.

    భారీ బడ్జెట్ సినిమాలకు ఊరట

    భారీ బడ్జెట్ సినిమాలకు ఊరట

    అలాగే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం కొన్ని హై బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. హై బడ్జెట్ సినిమాలు అంటే క్రియేటివిటీ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్, హైడ్ అండ్ టెక్నాలజీ వాడిన సినిమాలు అని పేర్కొన్నారు. వాటికి కచ్చితంగా భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి వాటిని స్పెషల్ గా ట్రీట్ చేయాలని పేర్కొన్నారు.

    ఏ సినిమా అయితే నటీనటుల రెమ్యూనరేషన్, దర్శకుల రెమ్యూనరేషన్ కాకుండా వంద కోట్ల రూపాయలు దాటుతాయో వాటికి సినిమా విడుదల చేసిన పది రోజుల పాటు సవరించిన రేట్లు ప్రభుత్వం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ కూడా ఒక కండిషన్ విధించారు. సదరు సినిమా 20 శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని చేయాలని ఒక కండిషన్ పెట్టారు. ఒకరకంగా ఇది రాధేశ్యామ్ సినిమాకి భారీ ఊరట గానే చెప్పాలి.

    English summary
    Andhra Pradesh Government released GO about Ticket Pricing. here is the full details about new GO
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X