twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddyపై జగన్ సర్కార్ ఫోకస్.. సినిమా చూసిన అధికారులు, త్వరలో యాక్షన్?

    |

    నందమూరి నట సింహం తాజాగా వీర సింహా రెడ్డిగా అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అత్యధిక భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ తన నటవిశ్వరూపం చూపించడాని అభిమానులు అంటున్నారు. రొటీన్ స్టోరీ అయిన డ్యాన్స్ లు, ఫైట్స్, డైలాగ్ లతో బాలయ్య బాబు అదరగొట్టాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మూవీ రిలీజ్ రోజే.. అందులోని డైలాగ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని సర్కార్ భావించి తగు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

    అంతకుమించి అనేలా డైలాగ్ లు..

    అంతకుమించి అనేలా డైలాగ్ లు..

    నట సింహం బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా అనగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. బాలయ్య బాబు ఫైట్స్, డ్యాన్స్, సాంగ్స్ అన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు ఆయన చెప్పిన డైలాగ్ లు అంతకుమించి అనేలా ఉన్నాయి.

    ఆనందోత్సాహాలతో..

    ఆనందోత్సాహాలతో..

    సాధారణంగానే బాలకృష్ణ సినిమాల్లో రాజకీయాలకు సంబంధించిన డైలాగ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా విడుదలైన వీర సింహా రెడ్డి మూవీలో కూడా అదే నిరూపితం అయిందని తెలుస్తోంది. వీర సింహా రెడ్డి విడుదల కావడంతో ప్రపంచవ్యాప్తంగా బాలయ్యకు ఉన్న అభిమానులు ఆనందోత్సాహలతో ఎంజాయ్ చేస్తున్నారు. దేశవిదేశాల్లో సైతం సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిందా అన్నట్లుగా సందడి చేశారు.

    ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా..

    ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా..


    వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ డైలాగ్ లకు విజిల్స్, అరుపులతో ఫ్యాన్స్ హోరెత్తించారు. ఇదంతా ఒకవైపు ఉంటే మరోవైపు ఈ డైలాగ్ లు కాంట్రవర్సీకి దారితీశాయి. ఇప్పుడంతా అందులోని కొన్ని డైలాగ్ లపై చర్చ నడుస్తోంది. వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య బాబు చెప్పిన డైలాగ్ లు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే మొదలయ్యాయి.

    సర్కారుకు వ్యతిరేకంగా..

    సర్కారుకు వ్యతిరేకంగా..

    తాజాగా వీర సింహా రెడ్డి వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావడంతో మరింత స్పష్టతవచ్చింది. దీంతో ఆ డైలాగ్ లపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసిందని సమాచారం. అంతేకాకుండా సినిమాలో ఆ డైలాగ్స్ ఏ సందర్భంలో, ఎందుకు వాడారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని కూడా పంపిందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక సినిమా చూసిన ప్రభుత్వ అధికారుల బృందం సర్కారుకు వ్యతిరేకంగా మాటలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిందట.

    సినిమాపై చర్యలు..

    సినిమాపై చర్యలు..

    నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలో పేల్చిన డైలాగ్ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఒక నివేదిక రూపంలో సర్కారుకు సమర్పించనున్నారట. అందుకోసం డైలాగ్ లు రికార్డ్ కూడా చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికల అనంతరం ఏపీ సర్కారు వీర సింహా రెడ్డిపై తగిన యాక్షన్ తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

    అభివృద్ధికి అర్థం తెలుసుకో..

    అభివృద్ధికి అర్థం తెలుసుకో..


    ఇక వీర సింహా రెడ్డి మూవీలో పాలించడం అంటే అభివృద్ధి.. ప్రజలను వేధించడం కాదు, జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చం వేయడం కాదు.. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు, నిర్మించడం అభివృద్ధి.. కూల్చటం కాదు, పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూసివేయటం కాదు.. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో అనే డైలాగ్ లు బాగా పేలాయి అని టాక్.

    English summary
    Balakrishna Satires On AP CM Jagan Mohan Reddy And Government In Gopichand Malineni Veera Simha Reddy Movie. AP CM Jagan Mohan Reddy Government Focus On Veera Simha Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X