»   » మరో హీరోయిన్ వేశ్యగా..., ఎందుకలా?

మరో హీరోయిన్ వేశ్యగా..., ఎందుకలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో వేశ్య పాత్రలకు ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. ఇలాంటి పాత్ర ఒకటి లభిస్తే నటిగా తమను తాము నిరూపించుకునే అవకాశం వస్తుందని భావించే తారలు ఎందరో. టాప్ హీరోయిన్లు కూడా వైవిధ్య భరితమైన ఇలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

దక్షిణాదిన ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు వేశ్య పాత్రలు చేసారు. ఛార్మి, వేదం చిత్రంలో అనుష్కలు వేశ్యలుగా నటించి తమ నటనకు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లిస్టులో ఇపుడు మరో హీరోయిన్ కూడా చేరబోతోంది. కమల్ హాసన్ విశ్వరూపంతో పాటు తెలుగు మూవీ తడాఖాలో సునీల్ కు జోడీగా నటించిన తమిళ నటి ఆండ్రియా సినీ పరిశ్రమలో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా రాణిస్తోంది.

 Andrea Jeremiah ti play prostitute role Andrea Jeremiah ti play prostitute role

తాజాగా ఈ భామ ధనుష్ హీరోగా రూపొందనున్న వడ చెన్నై చిత్రంలో నటిస్తుంది. ఇందులో ధనుష్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆండ్రియా వేశ్య పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర ఆండ్రియాకు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుందని, అందుకే ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు.

ఈ చిత్రం జూన్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. వేశ్య పాత్ర కథలో భాగంగానే ఉంటుందని తప్ప... అసభ్యతకు, అశ్లీలానికి తావు లేకుండా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు. అయితే పాత్రకు తగిన విధంగా ఆండ్రి కాస్త హాట్ లుక్ తో కనిపించబోతోందట.

English summary
Actress Andrea Jeremiah to play prostitute role in upcoming film starring Dhanush and Samantha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu