For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్‌హాట్‌గా ఆండ్రియా.. ఆయుష్మాన్ భవ‌లో క్రేజీగా..

  By Rajababu
  |

  చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. సి టి.ఎఫ్ నిర్మాణ‌ భాద్య‌త‌లు నిర్వ‌హిస్తోంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్‌, హంగ్ ఓవ‌ర్‌, హైహీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ సంగీతం అందిస్తున్నారు.

  ఈ చిత్రం లో ప్ర‌ముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అయితే ఇప్పుడీ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యింది. తమిళ్ లో అటు సింగర్ గా.. ఇటు హీరోయిన్ గా పలు సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న... ఆండ్రియా.. ఆయుష్మాన్ భవ చిత్రంలో పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన దీర్ఝ ఆయుష్మాన్ భవ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వ‌ర‌లోనే ఆండ్రియా మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తారు.

  Andrea will be seen key role in Ayushmanbhava

  ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌ సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా ధన్యవాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారు మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా భాద్య‌త‌లు స్వీక‌రించారు.

  ఆయుష్మాన్ భవ చిత్రంలో హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. అయితే ఇప్పుడీ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యింది. తమిళ్ లో అటు సింగర్ గా.. ఇటు హీరోయిన్ గా పలు సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న... ఆండ్రియా.. ఆయుష్మాన్ భవ చిత్రంలో పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. క్యారెక్టర్ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. ఇక బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు.

  Andrea will be seen key role in Ayushmanbhava

  ప్రేమించిన అమ్మాయి కులం, మ‌తం వేరైతే.. మ‌ర్చిపోవాలా.. పారిపోవాలా.. చ‌చ్చిపోవాలా.. ప్ర‌పంచం ఏమైతే నాకేంటి స‌మాజం ప్రేమ‌ని చూసే విధానం మారాలి లేక‌పోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. త్వ‌ర‌లోనే ఆండ్రియా మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తారు అని అన్నారు..

  Andrea will be seen key role in Ayushmanbhava

  న‌టీన‌టులు.. చ‌ర‌ణ్‌తేజ్‌, స్నేహ ఉల్లాల్‌, ఆండ్రియా, హుజ‌న్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ రావు, రంగ‌రాజ‌న్‌, అశ్విన్‌, నిఖిత త‌దిత‌రులు ..

  టైటిల్‌.. ఆయుష్మాన్ భ‌వ‌

  ప్రోడ‌క్ష‌న్ హౌస్ అండ్ ప్రోడ్యూస‌ర్‌.. సి.టి.ఎఫ్‌

  స‌హ‌-నిర్మాత‌.. మారుతి

  అసోసియెట్ ప్రోడ్యూస‌ర్‌.. బి.ఏ.శ్రీనివాస‌రావు , హేమ రత్న‌

  క‌థ‌-ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌.. త్రినాథ్ రావు న‌క్కిన‌

  క‌థ‌నం.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

  సంగీతం- మీట్ బ్రోస్‌

  కెమెరా.. దాశర‌ధి శివేంద్ర‌

  ఆర్ట్‌- పి.ఎస్‌.వ‌ర్మ‌

  కాస్ట్యూమ్స్‌- పొట్ట హ‌రిక‌

  ద‌ర్శ‌కత్వం- చ‌ర‌ణ్ తేజ్‌

  English summary
  Prema Katha Chitram and lovers movie production house Maruti Talkies has launched its production No-12 with the movie title “Ayushman Bhava”. Suriya has recently highlighted the long forgotten word Ayushman Bhava in his recent blockbuster movie 24, now to make it much more highlight Trinadha Rao Nakkina has titled his upcoming movie as “Ayushman Bhava.” The director Trinadha Rao is in full form with his last year success of “Cinema Chupista Maava” movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X