»   » 'దూకుడు' నిర్మాతపై మండిపడుతున్న స్నేహ ఉల్లాల్

'దూకుడు' నిర్మాతపై మండిపడుతున్న స్నేహ ఉల్లాల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : 'దూకుడు' చిత్ర నిర్మాత అనీల్ సుంకరపై స్నేహ ఉల్లాల్ కారాలు..మిరియాలు నూరుతోంది. అనీల్ సుంకర..నిర్మాతనుంచి దర్శకుడుగా మారి... అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో 3డి 'యాక్షన్‌' రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో స్నేహ ఉల్లాల్ ఓ డిఫెరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే ఆమె చిత్రం యూనిట్ పై మంటకు కారణమేమిటంటే... షూటింగ్ లో భాగంగా రెండు చిలకలు చనిపోవటమే. ఈ విషయమై ఆమె చాలా సీరియస్ గా ఉంది. గతంలో ఓ ట్వీట్ కూడా పెట్టి దర్శక,నిర్మాత ఆగ్రహానికి గురైంది.

  ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..." నేను జంతువులు,పక్షులను సరిగ్గా పట్టించుకోకపోతే అస్సలు ఊరుకోను..రెండు చిలకలు చనిపోవటంతో నాకు చాలా కోపం వచ్చింది. కానీ నేను ఎవరకీ ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వలేదు. అది యాక్సిడెంటిల్ గా అనుకోకుండా జరిగిందని చెప్పారు. కానీ మరోసారి ఇలాంటిది మాత్రం జరిగితే..నేను ఎవరినీ వదిలిపెట్టను.. " అలాగే..., "అనీల్ నాకు ప్రెండ్, కానీ సినిమా వాళ్లందరికీ ఈ ఇష్యూ ద్వారా ఎవరేనెస్ రావాలని మాట్లాడుతూన్నాను .," అంది.

  3డి సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న 'యాక్షన్‌' చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 'అల్లరి'నరేష్‌తో పాటు వైభవ్‌, రాజుసుందరం, 'కిక్‌'శ్యామ్‌ కథానాయకులు. స్నేహాఉల్లాల్‌, నీలమ్‌ ఉపాధ్యాయ, రితుబర్మేచ, కామ్నజెఠ్మలాని నాయికలు. 'బిందాస్‌', 'అహనాపెళ్ళంట' తదితర చిత్రాల నిర్మాత అనిల్‌ సుంకర దర్శకుడిగా పరిచయమవుతూ, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ అధికశాతం పూర్తయింది. బ్యాంకాక్‌, గోవాలలో కూడా చిత్రీకరణ జరిపారు.

  ప్రస్తుతం హైదరా బాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. పాటలను తియ్యడంలో కె.రాఘవేంద్రరావు శైలిని ప్రతిబింబించేవిధంగా ఈ చిత్రంలోని ఓ పాట కోసం ఎక్కువగా పూలను వినియోగించినట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషలలో రూపుదిద్దు కుంటున్న ఈ చిత్రం కోసం తండ్రీ తనయులు బప్పీలహరి, బప్పా, ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తు న్నారు. రీరికార్డింగ్‌తో పాటు తమన్‌ ఓ పాటకు సంగీతాన్ని సమకూర్చారు.

  English summary
  Sneha Ullal recently took on Dookudu maker Anil Sunkara for a different reason altogether. The actor blasted the unit members and the producer of her upcoming Telugu film Action 3D over the death of two parrots on the sets and is reportedly thinking of lodging a complaint with the Animal Welfare Board of India, which might affect the prospects of the film starring Allari Naresh, Shaam and Raju Sundaram. “I have zero tolerance for ill-treatment of animals and birds, so I vented my anger over the death of two parrots. But I am not lodging any complaints. I was told that it was an accident. But if something happens again, I won’t spare anyone.” She adds, “Anil is a friend, but I have taken up this issue to create awareness among the film fraternity.,”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more