»   » అందుకోసం మంగళసూత్రం అమ్మివేశా.. దుమ్ము దులిపిన ట్వింకిల్ ఖన్నా

అందుకోసం మంగళసూత్రం అమ్మివేశా.. దుమ్ము దులిపిన ట్వింకిల్ ఖన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్యాడ్‌మ్యాన్ చిత్రంపై కట్టుకథలు అల్లి రాసిన మీడియాపై హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాపై వ్యంగాస్త్రాలు సంధించి దుమ్ము దులిపేసింది. తన భర్త, అక్షయ్ కుమార్ నటిస్తున్న ప్యాడ్ మ్యాన్ నిర్మాణపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ట్వింకిల్ ఖన్నా ఇక భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది అని బాలీవుడ్ పత్రిక ఇటీవల కథనాన్ని వెల్లడించింది.

 నిర్మాతగా విఫలం..

నిర్మాతగా విఫలం..

ట్వింకిల్ ఖన్నా ఆగ్రహం వెనుక కారణమేమింటంటే.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ట్వింకిల్ ఖాన్నా అక్షయ్‌తో వివాహం తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నది. కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికే పరిమితమైంది ఇన్నాళ్లు. ఇటీవల అక్షయ్ కుమార్ నటిస్తున్న ప్యాడ్‌మ్యాన్ సినిమాకు నిర్మాతగా మారింది. అసలే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ట్వింకిల్ ఖన్నా ఆ పత్రిక తప్పుడు కథనం చూసి ఉవ్వెత్తున్న లేచి పడిందట.

నిర్మాణపరమైన సమస్యలు

నిర్మాణపరమైన సమస్యలు

ప్యాడ్‌మ్యాన్ బడ్జెట్‌ విపరీతంగా పెరిగిపోవడంపై ప్రొడక్షన్ టీమ్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో అప్పుల్లో పడింది. ప్రొడక్షన్ టీమ్ వైఫల్యంపై ట్వింకిల్ పూర్తిగా మౌనం దాల్చింది. అసలు ఇలా జరుగడానికి ట్వింకిల్ ప్రొడక్షన్‌ టీమ్‌ను గాలికి వదిలివేయడమే అని బాలీవుడ్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. ట్వింకిల్ జోక్యం వల్లనే ప్రొడక్షన్‌లో సమస్యలు తలెత్తాయి. ఆమె పద్దతి సరిగా లేకపోవడం వల్లనే నిర్మాణపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి అనే మరో వాదనను కూడా కథనంలో పేర్కొన్నది.

ఇంకా అలా రాయలేదు..

ఇంకా అలా రాయలేదు..

ఆ పత్రిక కథనం అంతా తప్పుడు తడక అని సదరు పత్రిక యాజమాన్యంపై ట్విట్టర్‌లో నిప్పులు చెరిగారు. ఎక్స్‌క్లూజివ్ పేరుతో మీరు ఇష్టం వచ్చినట్టు అభూత కల్పనలతో కథనాన్ని వండినారు. ఇంకా నేను మంగళసూత్రం కూడా అమ్మినట్టు రాయలేదు. ప్యాడ్‌మ్యాన్ పుతిన్ జీవిత కథ అని ఇంకా చెప్పలేదు అని సెటర్లు సంధించింది.

 అరుణాచలం కథతో..

అరుణాచలం కథతో..

ప్యాడ్‌మెన్ చిత్రం కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం మురుగనాథం జీవితం కథ ఆధారంగా తెరకెక్కుతున్నది. పాఠశాల విద్య కూడా పూర్తి చేయని అరుణాచలం అతి తక్కువ ఖర్చుతో మహిళలకు ఉపయోపడే శాటిటేషన్ న్యాప్కిన్లు తయారు చేశాడు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవి ఎంతో ఉపయోగకరంగా మారాయి.

English summary
Actress Twinkle Khanna lost her cool when a leading daily published a false report about her upcoming production venture Padman. Read on to know what exactly transpired. Twinkle Turns Producer Twinkle Khanna who started her career as an actress is one of the most successful authors today. Recently she added a one more feather in her cap by turning a producer for hubby Akshay Kumar's upcoming film Padman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu