»   » నేను ఆయన ముంబై కొడుకుని: అనిల్ కపూర్

నేను ఆయన ముంబై కొడుకుని: అనిల్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామానాయుడు అంత్యక్రియల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా పాల్గొన్నారు. 13 బాషల్లో దాదాపు 150 సినిమాలు నిర్మించిన రామానాయుడు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు నిర్మించారు. అనిల్ కపూర్ హీరోగా 5 సినిమాలు చేసాడు. రామానాయుడుతో చేసిన సినిమాలు అనిల్ కపూర్ కి బాగా కలిసొచ్చాయి.

రామానాయుడు మరణవార్త అనిల్ కపూర్ ను ఎంతగానో కలిచి వేసింది. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రామానాయుడు గారు నన్ను నా ముంబై కొడుకు అని పిలిచేవారు. ఆయన నన్ను తన సొంత కొడుకులా, తన ఫ్యామిలీలో ఒకరిలా చూసుకునే వారు. రామానాయుడు లేని ఇండియన్ సినిమాని ఊహించుకోవడం చాలా కష్టం. ఆయన అందించిన సేవలు మరువలేనివి, ఆయన లేని లోటు తీరనిది' అన్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anil Kapoor about Ramanaidu

రామానాయుడు అంత్యక్రియల్లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, శ్రీదేవితో పాటు తమిళ నటుడు కార్తితో పాటు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
Anil Kapoor fondly remembered that Ramanaidu used to call him his Mumbai son and treated him like his family member.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu