»   » కూతురు సోనమ్ బికినీ యాక్ట్స్‌పై అనిల్ కపూర్ ఇలా..!

కూతురు సోనమ్ బికినీ యాక్ట్స్‌పై అనిల్ కపూర్ ఇలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ వారసురాలిగా ఆయన కూతురు సోనమ్ కపూర్ నటిగా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'బేవకూఫియాన్' చిత్రంలో సోనమ్ కపూర్ బికినీతో నటిస్తోంది. అయితే కూతురు ఇలా బికినీలు వేసి నటించడంపై అనిల్ కపూర్ లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటి సినిమాల్లో ఇవన్నీ కామనే కాబట్టి దీన్ని.....కూతురుకు సపోర్టుగా ఉంటున్నారట.

బేవకూఫియాన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల సోనమ్ కపూర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా వారు ఆమెపైకి రకరకాల ప్రశ్నలు సంధించారు. మీరు బికినీలు వేసి నటించడంపై మీ నాన్న అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు సోనమ్ స్పందిస్తూ....'ఆయనకు ఆ విషయం తెలుసు. మా నాన్న కూడా ఒక ఆర్టిస్టే. ఆయన చాలా ఓపెన్ మైండెడ్. నేను నటిగా మారుతానంటే ఆయన చాలా ఎంకరేజ్ చేసారు. నాకు చాలా స్వచ్ఛనిచ్చారు. అలా చెయ్, ఇలా చేయకు అని ఏమీ చెప్పలేదు. సినిమాకు మంచి ఓపెన్సింగ్స్ రావాలి' అని మాత్రమే చెప్పారు అని సోనమ్ కపూర్ వెల్లడించారు.

Anil Kapoor Is Cool With Beti Sonam Kapoor's Bikini Avatar

ఇందులో బికీనీ ధరించడానికి పర్ ఫెక్ట్ బాడీ షేప్ రావడానికి పెద్దగా ఏమీ కష్టపడలేదు. నేను రెగ్యులర్‌గా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను కాబట్టి.....శరీరాకృతి విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. బేవకూఫియాన్ చిత్రం అందరినీ నచ్చుతుందని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చారు.

సోనమ్ కపూర్, ఆయేష్మాన్ ఖురానా జంటగా....రూపొందుతున్న చిత్రం 'బేవకూఫియాన్'. బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నుపుర్ అస్తానా ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషీ కపూర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. హబీబ్ పైజల్ ఈ చిత్రానికి కథ అందించారు. రఘు దీక్షిత్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Anil Kapoor is a star with sense of humour. He is not at all bothered about his daughter Sonam Kapoor's bikini act in the upcoming flick, Bewakoofiyaan. Instead, he wittily points out that it would get the film a huge opening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu