»   » హీరో సూర్యపై బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ లీగల్ యాక్షన్?

హీరో సూర్యపై బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ లీగల్ యాక్షన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్...తమిళ స్టార్ సూర్య మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం ‘మనం' ఫేం విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘24' అనే మూవీ చేస్తున్నాడు. ‘24' టైటిల్ విషయంలో అనిల్ కపూర్, సూర్య మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం.

అమెరికన్ టీవీ సీరీస్ ‘24' హక్కులను ట్వంటీన్త్ సెంచరీ ఫాక్స్ ఇంటర్నేషనల్ సంస్థ నుండి అనిల్ కపూర్ కొనుగోలు చేసారు. హిందీ బాషలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో ప్రసారం చేసేందుకు ఆయన ఈ హక్కులు కొనుగోలు చేసారు. ఇప్పటికే ఫస్ట్ సీజన్ కలర్స్ ఛానల్ లో ప్రసారం అవుతోంది.

Anil Kapoor to take legal action against Surya

అయితే సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘24' టైటిల్, లోగో అమెరికన్ టీవీ సీరియల్ మాదిరిగా ఉండటంతో....వెంటనే అనిల్ కపూర్ సూర్యకు ఫోన్ చేసి ఆ టైటిల్ మార్చాలని కోరాడు. అయితే సూర్య తన సినిమా టీంతో మాట్లాడి చెబుతానన్నట్లు సమాచారం. ఒక వేళ సూర్య టైటిల్ విషయంలో వెనక్కి తగ్గకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అనిల్ కపూర్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

English summary
Bollywood actor Anil Kapoor is likely to take legal action against Tamil star Suriya for using the title '24' for his upcoming flick to be directed by 'Manam' fame Vikram Kumar.
Please Wait while comments are loading...