»   » మహేష్‌ '1' గురించి నిర్మాత

మహేష్‌ '1' గురించి నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అన్నది ట్యాగ్ లైన్. కృతి సనన్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ నెల 18 నుంచి లండన్‌, బెల్‌ఫాస్ట్‌ల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఏకబిగిన రెండు నెలలపాటు చిత్రీకరణ చేస్తారు. నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర .

అనిల్‌ సుంకర మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే పది లక్షల మంది ఆ టీజర్‌ని వీక్షించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది''అన్నారు. మరో ప్రక్క టీజర్‌ వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మహేష్ మాట్లాడుతూ...'' టైటిల్ కు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను అందుకొనేందుకు చిత్రబృందం సమష్టిగా కృషి చేస్తోంది. నా సినీ జీవితంలో '1' ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. నాపై చూపుతున్న అభిమానానికి, అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు'' అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

'దూకుడు' తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై చాలా హై ఎక్సెపెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కి ధీటుగా సుకుమార్ ఈచిత్రాన్ని సరికొత్త స్టైల్‌లో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నారు . ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh’s '1' Nenokkadine Shooting is going on a brisk space and the new schedule which is set in London will kick start from 18th of this month. Kriti Sanon plays the lead role and Sukumar has directed the film. Devi Sri Prasad has composed the music and 14 Reels Entertainments have produced this musical entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu