»   »  రేపే 'ఘటోత్కచ' రాక

రేపే 'ఘటోత్కచ' రాక

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ghathotokach
"మాయా బజార్ చిత్రంలో ఘటోత్కచుడి పాత్ర అందరికి నచ్చింది. అతను మాయలు, మంత్రాలు తెలిసిన వ్యక్తి, భోజన ప్రియుడు, ఈ పాత్రలో ఉన్న మూడు క్వాలిటీస్ అందరికి నచ్చుతాయి. అందుకే చిన్నప్పుడు ఘటోత్కచుడు ఎలా ఉండే వాడు అని ఊహించుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. అంటున్నారు 'ఘటోత్కచ' దర్శకుడు సింగీతం శ్రీనివాస్. ఆయన యానిమేషన్స్ లో 'ఘటోత్కచ' పాత్రను రూపొందించి వేసవి కానుకగా రేపటి నుంచి (శుక్రవారం) పిల్లలకు అందిస్తున్నారు.

షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో స్మిత మారు, సూర్య దేవరలు సంయుక్తంగా,ఈ చిత్రం భారీ వ్యయ ప్రయాసలుకు ఓర్చి నిర్మించారు. పిల్లల్ని, పెద్దల్ని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని సింగీతం అంటున్నారు. ఈ చిత్రం కోసం పిలిపైన్స్, టొరంటో, చెన్నై, హైదరాబాద్‌లలో యానిమేషన్స్ చేయించి మొత్తం ఏడు భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంటే రేపటినుంచి పిల్లలు 'ఘటోత్కచుడు తో ప్రెండ్షిప్ చెయ్యచ్చన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X