»   » త్రివిక్రమ్ కి ఆ బూతుపాట కుర్రాడిపై అంత నమ్మకమేమిటి?? పవన్ తో సినిమాకి అతన్నే

త్రివిక్రమ్ కి ఆ బూతుపాట కుర్రాడిపై అంత నమ్మకమేమిటి?? పవన్ తో సినిమాకి అతన్నే

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. 'వై దిస్ కొలవెరి డీ..' ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్ అంటూ ఒక బూతు పాట హల్చల్ చేసింది కదా ఆ పాటకి కూడా మనోడే మ్యూజిక్ డైరెక్టరన్న మాట. శింబు తో కలిసి ఆ బూతు ప్రయోగం, చేయటం వల్ల కేసుల్లో ఇరుక్కొని .

ఆ సాంగ్ వివాదం కారణంగా త్రివిక్రమ్ తో చేయాల్సిన 'అ..ఆ' ప్రాజెక్టు నుండి బయటకు వచ్చిన అనిరుధ్ ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దాదాపు ఈ కుర్రాడు ఫైనల్ అయిపోయినట్టే అని టాక్. అసలు ఆ మధ్య ఎస్.జే.సూర్య పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్న ఖుషీ సీక్వెల్ కి అనిరుధ్ నే తీసుకుందామనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ వాయిదా పడటం తో ఈ "బీప్ సాంగ్" మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆగిపోవాల్సి వచ్చింది.

Anirudh Ravichander will score music for Pawan Kalyan and Trivikram's next film

'జల్సా'తో ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేసిన పవన్, త్రివిక్రమ్‌లు.. 'అత్తారింటికి దారేది'తో భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. ఈ రెండూ సగటు తెలుగు చిత్రాల తరహాలోనే ఉంటాయి. ఈసారి మాత్రం సరికొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ప్రేక్షకులకు కొత్త చిత్రం అందించాలనుకుంటున్నారట.

అటు పవన్.. ఇటు త్రివిక్రమ్.. ఈ చిత్రం గురించి మాట్లడడం లేదు. ఈ విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తనే కంఫర్మ్ చేసాడు కూడా. అంతే కాదు తమిళ్ లోనే హీరోగా కూడా ట్రై చేస్తున్న అనిరుధ్ ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రాణించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. "త్రివిక్రమ్ 'అఆ'కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా'' అని అనిరుధ్ చెప్పాడు. ఈ చిత్రానికి 'దేవుడే దిగి వచ్చినా' టైటిల్ పరిశీలనలో ఉంది.

English summary
The music director himself has confirmed the news and said that he is composing music for Trivikram, Pawan kalyan Combo Movie "devude digivachina"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu