»   »  పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శివకార్తికేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన 'రెమో' చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుదల చేయబోతున్నారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వహించగా, అనిరుధ్ సంగీతం అందించారు.

ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సమంత ఆడియో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆమె సంగీత దర్శకుడు అనిరుధ్ ను ఉద్దేశించిన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.

స‌మంత మాట్లాడుతూ....అనిరుధ్ రెమో చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. త్వరలో నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాకు పని చేయబోతున్నాడు అని తెలిపారు.

 తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తా

తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తా

అనిరుధ్ ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు సైన్ చేసి వదిలేసి వెళ్లిపోయారు. ఈ సారి ఏదైనా తప్పు జరిగితే నేనే పర్సనల్ గా వెళ్ళి కిడ్నాప్ చేద్దామని అనుకుంటున్నాను. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్‌గారి కాంబినేష‌న్‌ అంటే నాకు ఎంతో ఇష్టం...' అని సమంత తెలిపారు.

 దిల్‌రాజు మాట్లాడుతూ...

దిల్‌రాజు మాట్లాడుతూ...

రెమో సినిమా త‌మిళంలో స‌క్సెస్ అయిన తీరు, క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న విధానం న‌చ్చ‌డంతో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డానికి ఆస‌క్తి చూపాను. న‌వంబ‌ర్‌లో `రెమో` తెలుగులో విడుద‌ల కానుంది. త‌మిళంలో స‌క్సెస్ అయిన విధంగానే తెలుగులో కూడా ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. శివ‌కార్తీకేయ‌న్‌కు ఈ సినిమా తెలుగులో గుడ్ ఎంట్రీఅవుతుంది. సినిమా చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో ఆ ఫీలింగ్ స‌క్సెస్‌తో రేపు తెలుగులో కూడా నిజ‌మ‌వుతుంది అని దిల్ రాజు తెలిపారు.

 అనిరుధ్ మాట్లాడుతూ

అనిరుధ్ మాట్లాడుతూ

రెమో`సినిమాకు వ‌ర్క్ చేయ‌డం ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఈ సినిమా మా యూనిట్‌కు ఎంతో ముఖ్యంగా భావిస్తున్నాం. శివ‌కార్తీకేయ‌న్‌, రాజాగారికి ఈ సినిమా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రాజాగారు మంచి ప్యాష‌నేట్ నిర్మాత‌. దిల్‌రాజుగారు ఇంత మంచి లాంచ్ ఇస్తున్నందుకు ఆయ‌న‌కు థాంక్స్‌ అన్నారు.

 శివ‌కార్తీకేయ‌న్ మాట్లాడుతూ

శివ‌కార్తీకేయ‌న్ మాట్లాడుతూ

`త‌మిల్‌లో హిట్ అయిన రెమోను తెలుగులో పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారికి థాంక్స్‌. మా సినిమాకు చాలా మంచి ఫ్లాట్ పాం ఇచ్చారు. పి.సి.శ్రీరాంగారితో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు భాగ్యరాజ్ కన్నన్ న‌న్ను అంద‌మైన అమ్మాయిగా మార్చేశాడు. నా నుండి త‌న‌కేం కావాలో ఆ న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. కీర్తిసురేష్ నా లేడీ గెట‌ప్ మేట‌ర్‌లో బాగా స‌పోర్ట్ చేశారు. అనిరుధ్ చాలా స‌న్నగా ఉన్నా, అమితాబ్ గారిలా పాజిటివ్ వాయిస్‌ను క‌లిగి ఉంటారు. త‌నెంతో పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తుంటాడు. 24 ఎ.ఎం.స్టూడియోస్ రాజాగారికి థాంక్స్‌. రెమో క‌ల‌ర్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో డిప‌రెంట్ స్టోరీ ఏదీ లేదు. డిఫ‌రెంట్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. తెలుగులో నా తొలి సినిమాలా భావిస్తున్నాను.తెలుగులో న‌వంబ‌ర్‌లో రిలీజ్ కానుంది. సినిమా ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.

    English summary
    Anirudh Telugu Debut With Pawan Kalyan Movie, Samantha Says at Remo Audio Launch.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu