»   » గబ్బర్ సింగ్-2 హీరోయిన్ విమర్శలను ఓర్చుకుంటూ...

గబ్బర్ సింగ్-2 హీరోయిన్ విమర్శలను ఓర్చుకుంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా ఎంపికయింది. ఈ అమ్మడు అంతకు ముందు అలియాస్ జానకి చిత్రంలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆడక పోవడంతో అమ్మడుకి చాలా కాలంగా అవకాశాలు రాలేదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకుండా పోయింది.

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 రూపంలో ఆమెను అదృష్టం తలుపు తట్టింది. ఈ సినిమాకు సైన్ చేసిన తర్వాత గోపాల గోపాల చిత్రంలో యాంకర్ పాత్రలో గెస్ట్ రోల్ చేసింది. యాంకరమ్మగా చీరకట్టులో అనీషా ఏ మంత ఆకట్టుకోలేక పోయిందని, ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్-2 చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఆమె సెట్టవుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anisha Ambrose posted her glamorous stills

ఈ విమర్శలు అనీషా చెవిన పడ్డాయి కూడా. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. తనను తాను నిరూపించుకునే అవకాశం కేవలం గబ్బర్ సింగ్-2 చిత్రంతోనే సాధ్యం. ఆ విమర్శలను ఓర్చుకుంటూ ఇప్పటి నుండే అన్ని విధాలా ప్రిపేర్ అవుతోందట. ముఖ్యంగా గ్లామర్ ప్రదర్శనపై అమ్మడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

గబ్బర్ సింగ్-2 చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిచబోతున్నారు. ‘గోపాల గోపాల' విడుదల కావడంతో కాస్త ఫ్రీ అయిన పవన్ కళ్యాణ్....పర్సనల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు.

చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి. . ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు.

English summary
Anisha Ambrose, the young girl from Vizag who made her debut with Neelima Tirumalasetti's Alias Janaki, shocked everyone when she signed for one of the craziest films of the season Powerstar Pawan Kalyan's Gabbar Singh 2. Ever since Anisha posted her glamorous stills on her social networking page, fans have been raving about her slender figure and positive attitude.
Please Wait while comments are loading...