»   » అమ్మేసారు: రాజేష్ ఖన్నా ఆస్తి తగాదా మళ్లీ కోర్టుకు

అమ్మేసారు: రాజేష్ ఖన్నా ఆస్తి తగాదా మళ్లీ కోర్టుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం తర్వాత ఆయన ఆస్తుల వ్యవహారంలో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజేష్ ఖన్నా నివాస భవనం 'ఆశీర్వాద్' విషయంలో ఆయన కూతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకి ఖన్నా.....ఆయనతో సహజీవనం చేసిన అనితా అద్వానీ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

తండ్రి మరణం అనంతరం ఆ భవనం ట్వింకిల్, రింకీ ఖన్నాలకు సంక్రమించగా...వారు ఆ బంగ్లాను ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మణ్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చాలని రాజేష్ ఖన్నా ఆశ పడ్డారు. కానీ కూతుర్లు ఇలా చేసారనే వార్తి విని పలు అభిమానులు నివ్వెరపోతున్నారు.

Anita Advani challenges sale of 'Aashirwad'

మరో వైపు ఆ ఇంటిలో తనకూ వాటా ఉందని అనితా అద్వానీ ఇప్పటికే కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నాతో అతని భార్య డింపుల్ ఖన్నా విడిపోయిన తర్వాత అనిత అద్వానీ ఆయనకు దగ్గరయ్యారు. ఆయన మరణించడానికి ఎనిమిదేళ్ల ముందు నుండే రాజేష్ ఖన్నాతో సహజీవనం చేస్తున్నారు.

ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదంటూ అనితా అద్వానీ కోర్టుకు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. బంగ్లా విషయంలో గతంలో తనకు కోర్టు నుండి అనుకూల తీర్పు వచ్చిందని, కోర్టు తీర్పును గౌరవించకుండా రాజేష్ ఖన్నా కూతుర్లు ఆ బంగ్లాను అమ్మడం సరికాదని ఆమె అంటున్నారు. బంగ్లా అమ్మకుండా తుది వరకూ పోరాడుతానని ఆమె తెలిపారు.

English summary

 Anita Advani challenges sale of Rajesh Khanna's Mumbai residence 'Aashirwad'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu