»   » వచ్చి వచ్చి ఎన్టీఆర్ మీద పడింది

వచ్చి వచ్చి ఎన్టీఆర్ మీద పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సరైన హిట్ కోసం ఎన్టీఆర్ భాక్సాఫీస్ వైపు చాలా ఆశగా చూస్తూ రభస చిత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడా చిత్రానికి తమిళ స్టార్ హీరో సూర్య రూపంలో పెద్ద పోటీ ఎదురౌతోంది. సూర్య,సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న అంజాన్ (ఇంకా తెలుగు టైటిల్ పెట్టలేదు) చిత్రం విడుదల తేదీ, ఎన్టీఆర్ రభస తేది ఒక రోజు మాత్రమే తేడా ఉంది. తెలుగులో సూర్య చిత్రాలు డబ్బింగ్ లు బాగానే ఆడుతున్నాయి...అలాగే భారీగా విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా అంజాన్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. పూర్తి యాక్షన్ చిత్రం కావటంతో ఇక్కడా బాగానే క్రేజ్ క్రియేట్ అయ్యే అవకాసం ఉంది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాసం ఉందంటున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

 'Anjaan' is gearing up for release on August 15th

చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary

 Suriya and Samantha starrer 'Anjaan' is gearing up for release on August 15th, 2014. Although this versatile hero has got only half of market that Tarak enjoys in AP, His film would surely affect the openings and full run revenue of 'Rabhasa'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu