»   » బాలకృష్ణ కోపం గురించి అంజలి

బాలకృష్ణ కోపం గురించి అంజలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సెట్‌లో చాలా కోపంగా ఉంటారనీ... క్రమశిక్షణ ఎక్కువనీ ఇలా చాలా చాలానే విన్నా. దీంతో తొలి రోజు భయపడుతూనే సెట్‌కి వెళ్లా. క్రమశిక్షణ, సమయపాలన విషయాల్లో చెప్పినట్టే జరిగింది కానీ... బాలకృష్ణగారు సెట్‌లో కోప్పడిన సందర్భం మాత్రం ఒక్కటంటే ఒక్కటీ లేదు అంటూ చెప్పుకొచ్చింది అంజలి. నందమూరి బాలకృష్ణతో ఆమె ‘డిక్టేటర్‌'లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అంజలి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ఆమె చెప్పిన విషయం ఇది.

అలాగే..బాలకృష్ణ ...ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడుపుతుంటారాయన. హీరోయిన్స్, సహనటుల దగ్గరే కాదు... లైట్‌బాయ్‌ వరకు అందరితోనూ అదే కలుపుగోలుతనం. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకొన్నా. నటనకు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారు.

Anjali about Balakrishna anger

ఇక డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నా నటనని చూసి ‘చాలా బాగా చేశావు' అని మెచ్చుకోవడం ఇంకా ఆనందాన్నిచ్చింది. ‘డిక్టేటర్‌' ఒక కొత్త రకమైన సినిమా. ఇదివరకటి బాలకృష్ణగారి సినిమాలకంటే భిన్నంగా ఉంటుంది. నా పాత్ర కోసం ఐదున్నర కిలోలు తగ్గా.

ఇంతకుముందు ‘లెజెండ్‌', ‘లయన్‌' చిత్రాల్లో బాలకృష్ణగారి సరసన నటించే అవకాశం వచ్చినా, కాల్షీట్ల సమస్య వల్ల చేయలేకపోయా. ఈసారి మాత్రం వదల్లేదు అని చెప్పింది. ఈ చిత్రంపై ఆమె చాలా అంచనాలు పెట్టుకుంది.

English summary
Anjali said that she is very happy to work with Balakrishna in dictator movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu