twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంజలి దేవి అంతిమయాత్ర, రోశయ్య, బాలు..(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై: ఈ నెల 13న అనారోగ్యంతో మరణించిన నటి అంజలి దేవి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం చైన్నెలో నిర్వహించారు. అంతకు ముందు అంజలి దేవి నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన అంజలి దేవి భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు.

    తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యతో పాటు ప్రముఖ గాయకులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, నటులు శరత్ బాబు తదితరులు అంజలి దేవి భౌతిక కాయాన్ని సందర్శించి అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు సినిమా ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

    అంతిమ యాత్రకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

    రోశయ్య..

    రోశయ్య..


    తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అంజలి దేవి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

    ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం


    ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం నటి అంజలి దేవి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    శరత్ బాబు

    శరత్ బాబు


    ప్రముఖ నటుడు శరత్ బాబు నటి అంజలి దేవి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    పి సుశీల

    పి సుశీల


    ప్రముఖ గాయని పి సుశీల నటి అంజలి దేవి, తదితరులు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    అంజలి దేవి

    అంజలి దేవి


    అంజలి దేవి వయస్సు 86 సంవత్సరాలు. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి.

    ఐదువందల చిత్రాలకు పైగా...

    ఐదువందల చిత్రాలకు పైగా...


    సినిమాలు ఆమె ఐదువందలకు పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. అప్పటి నుండి వెండితెర సీతగా పేరుగాంచారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు.

    సినిమా అవార్డులు

    సినిమా అవార్డులు


    నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అంజలి దేవి అందుకున్నారు.

    చివరగా...

    చివరగా...


    అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ఆరంభించారు. అంజలీ దేవి భర్త ఆదినారాయణ రావు సంగీత దర్శకులు. అంజలి పిక్చర్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు.

    English summary
    Anjali Devi Funeral held Chennai. Anjali Devi will not be remembered only for her brilliance on screen but also for her commanding presence behind the scenes, say her contemporaries from the film industry. The veteran actress and producer, who was born in Andhra Pradesh in 1927, died of a cardiac arrest at a city hospital on Monday. She was 86.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X