»   » అంజలి దేవి అంత్యక్రియలు గురువారం(ఫోటో)

అంజలి దేవి అంత్యక్రియలు గురువారం(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటి అంజలీ దేవి సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వెండితెర సీతగా పేరుగాంచిన అంజలీ తమిళనాడు రాజధాని చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం అంజలిదేవి అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె భౌతిక కాయాన్ని భద్రపరిచారు. గురువారం ప్రజల సందర్శనార్ధం స్వగృహంలో ఉంచుతారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Anjali Devi

అంజలి దేవి వయస్సు 86 సంవత్సరాలు. 1927 ఆగస్టు 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 13న తుది శ్వాస విడిచారు. ఆమె ఐదువందలకు పైగా చిత్రాల్లో నటించారు.

లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ద్వారా ఎనలేని కీర్తిని సంపాదించారు. అప్పటి నుండి వెండితెర సీతగా పేరుగాంచారు. లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు.

అంజలీ దేవి భర్త ఆదినారాయణ రావు సంగీత దర్శకులు. అంజలి పిక్చర్స్ పతాకంపై పలు సినిమాలను నిర్మించారు. నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అంజలి దేవిని అందుకున్నారు. అంజలీ దేవి చివరి చిత్రం బిగ్ బాస్. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. రంగస్థలం ద్వారా నట జీవితాన్ని ఆరంభించారు.

English summary
Veteran actress Anjali Devi has taken her last breath at Vijaya Hospitals, Chennai this afternoon [13th Jan] after serious illness. Anjali Devi (86 years) has been hospitalized from last few days and has died today afternoon around 2:15 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu