»   » హీరోయిన్ అంజలికి ఫైనల్ వార్నింగ్, ఇక అరెస్టే?

హీరోయిన్ అంజలికి ఫైనల్ వార్నింగ్, ఇక అరెస్టే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anjali
చెన్నై : తమిళ దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం దావాతో పాటు ఆమె పిన్ని భారతి కేసులో హీరోయిన్ అంజలి చెన్నై కోర్టుకు మరోసారి డుమ్మా కొట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె మంగళవారం (జులై 2) విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైంది. ఇప్పటికే అంజలి పలు పర్యాయాలు గైర్హాజరు కావడంతో కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే అంజలి ఖాతరు చేయలేదు.

దీంతో ఈ సారి మరింత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఈ నెల 9లోగా కోర్టుకు హాజరు కాకుండా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గతంలో పలు పర్యాయాలు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చినా....అంజలి పట్టించుకోక పోవడం గమనార్హం. మరి ఈ సారైనా కోర్టు ఆదేశాలను పాటిస్తుందో లేదో చూడాలి.

జులై 9లోగా కోర్టు ఆదేశాల మేరకు హాజరు కాక పోతే...ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, తన ఆస్తులు వాడుకుంటున్నారని, మానసికంగా హింసిస్తున్నారని మీడియాతో సంచలన వ్యాఖ్యాలు చేసిన అంజలి ఆ తర్వాత అజ్ఞాతంలో వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత అజ్ఞాతం వీడిన ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా....అంజలి తనపై ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కళంజియం ఆమెపై పరువునష్టం దావా వేసారు. అంతే కాకుండా అంజలి తన సినిమాకు డేట్స్ ఇచ్చి హాజరు కావడం లేదని, ఆమె మూలంగా తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు.

English summary
On Tuesday, Anjali once again failed to turn up at the Madras High Court in the Habeas Corpus petition filed by her aunt Bharathi Devi. The court warned that she would be issued an arrest warrant. The case will now be heard on June 9.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu