»   » హీరోయిన్ అంజలి...... రోసాపూ!

హీరోయిన్ అంజలి...... రోసాపూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు హీరోయిన్ అంజలి తమిళం, తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. ఈ రెండు పరిశ్రమల్లో అంజలి చెప్పుకోదగ్గ పలు విజయాలు తన ఖాతాలో వేసుకుంది. అయితే మళయాల చిత్ర పరిశ్రమలో మాత్రం అంజలి తన ముద్ర వేయలేక పోయింది.

Anjali photo gallery

గతంలో అంజలి మళయాలంలో 2010లో 'పయ్యన్స్' అనే చిత్రంలో నటించింది. మళయాల నటుడు జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ చేసిన అంజలికి ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. బాక్సాఫీసు వద్ద పెద్ద ప్లాప్ అయింది.

రోసాపూ...

రోసాపూ...

త్వరలో అంజలి మళ్లీ మళయాలంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ‘రోసాపూ' అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బిజ్జు మీనన్ హీరోగా చేస్తున్నాడు.

Hot Beauties In Black : Actress Black Dress Photos
హాఫ్ హాఫ్

హాఫ్ హాఫ్

ఈ చిత్రంలో అంజలి పాత్ర చాలా డిఫరెంటుగా ఉంటుందని.... ఇందులో ఆమె ఆఫ్ తమిళియన్, హాఫ్ కన్నడిగా పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. సినిమాలో అంజలి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది.

రోసాపూ మూవీ

రోసాపూ మూవీ

రోసాపూ... సినిమా విశేషాల్లోకి వెళితే ఈ చిత్రానికి సంతోష్ అచ్చికన్నమ్ స్క్రిప్టు అందించారు. కామెడీ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. బిజు మీనన్, అంజలితో పాటు సౌబిన్ సాహిర్, దిలీష్ పోతన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అంజలి

అంజలి

తెలుగు ఫ్యామిలీ నుండి వచ్చిన అంజలి.... తెలుగు మూవీ ‘ఫోటో' ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించింది. తొలి నాళ్లలో నటిగా అంజలికి తెలుగులో కలిసి రాలేదు. దీంతో తమిళ సినిమాల వైపు వెళ్లి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. ఇపుడు మళయాలంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది.

Read more about: anjali, biju menon, mammootty
English summary
Anjali, is definitely one among the most talented actresses of the South Indian film industry. The popular actress has already made a mark in the Tamil and Telugu film industries and has proved her acting prowess,with some good performances. Earlier, Anjali had appeared in the Malayalam film Payyans, which featured Jayasurya in the lead role. The actress appeared as the leading lady in the movie, but the film failed to make a mark at the box office
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu