»   » మెగాస్టార్ సినిమాలో వేశ్యగా హీరోయిన్ అంజలి

మెగాస్టార్ సినిమాలో వేశ్యగా హీరోయిన్ అంజలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంజలి ప్రస్తుతం బాలయ్యతో ‘డిక్టేటర్' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అంజలి నటించిన భారీ ప్రాజెక్టులలో ఇదీ ఒకటి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... అంజలి మరో భారీ ప్రాజెక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మళయాలం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమాలో ఆయనకు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మమ్ముట్టి కోలీవుడ్లో నటిస్తున్న రీఎంట్రీ మూవీలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘పెరంబు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రామ్ దర్శకత్వం వహించబోతున్నారు.

Anjali opposite Mammootty

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ట్రాన్స్ జెండర్‌గా, వేశ్యగా కనిపించబోతోందట. ఈ చిత్రం జనవరి 6వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోబోతోందని సమాచారం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఈ సినిమాలతో పాటు అంజలి ‘సరైనోడు' మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. దీంతో పాటు ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది' సీక్వెల్ మూవీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

English summary
Anjali will be seen opposite Malayalam Megastar Mammootty in the actor’s comeback movie in Kollywood. This film titled ‘Peranbu’, will be directed by National award winning director Ram.
Please Wait while comments are loading...