»   » ‘బలుపు' లో అంజలి పాత్ర ఏమిటంటే...

‘బలుపు' లో అంజలి పాత్ర ఏమిటంటే...

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్న అంజలి మరో తెలుగు సినిమా కమిటైంది. రవితేజ సరసన ఆమె బలుపు చిత్రం చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె మెడికో గా కనిపించనుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న బలుపు చిత్రంపై రవితేజ తన ఆశలన్ని పెట్టుుకన్నారు. రవితేజతో గతంలో డాన్ శీను హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది.

  రవితేజ హీరోగా గోపిచంద్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న బలుపు చిత్రం షూటింగ్‌ విశాఖలో శరవేగంగా జరుగుతుంది. కైలాసగిరి, రుషికొండ తీరప్రాంతాల్లో హీరో రవితేజ, హీరోయిన్ అంజలిలపై పాటను, రుషికొండ తీరంలో జీపులో హీరోహీరోయిన్లు వస్తున్న సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ను చూసేందుకు తీరానికి వచ్చిన సందర్శకులు, పర్యాటకులు ఆసక్తి కనబరిచారు.

  పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి 'బలుపు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

  ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా, పంజా విలన్ అడవి శేషు విలన్ గా చేస్తున్నారు. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది.

  English summary
  
 Anajali will be soon seen as medico in her upcoming Ravi Teja-starrer Balupu, directed by Gopichand Malineni. After bagging a meaty role as second heroine in the multi-starrer film Seethamma Vaakitlo Sirimalle Chettu, Anjali was particular about being a part of good films and the latest we hear is that the actress will play a medical college stundent in the action entertainer Balupu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more