»   »  అంజలీ.... ఆరోజు మొత్తం అతని తోనే ఉందట....

అంజలీ.... ఆరోజు మొత్తం అతని తోనే ఉందట....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు ఇటీవల దోశ చాలెంజ్ సందర్భంగా ఓపెన్ అయిపోయారు. తాజాగా జై స్వయంగా అంజలితో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు.

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు

హీరోయిన్ అంజలి, హీరో జై మధ్య ఏదో ఉందని, వారు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే వార్తలు ఇటీవల మీడియా జోరందుకున్నాయి. అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, పెళ్లి వార్తలు పుకార్లేనని చాలా సార్లు ప్రకటించినప్పటికీ వారి మధ్య స్నేహం కంటే ఎక్కువ బంధమే ఉందని వినిపిస్తున్నది.

జై పుట్టిన రోజును పురస్కరించుకొని

జై పుట్టిన రోజును పురస్కరించుకొని

ఏప్రిల్ 6 తేదీన జై పుట్టిన రోజును పురస్కరించుకొని ‘హ్యాపీ బర్త్‌డే మై డియర్ జే. నీ కోరికలు నిజం కావాలి. నీకు అన్ని రకాల సంతోషం కలుగాలి. ఎప్పటిలాగానే మన మధ్య బంధం ప్రేమతో ఇలానే ఉండాలి అని అంజలి ట్వీట్ చేసింది.

షూటింగ్ స్పాట్‌కు వెళ్లి జైకి షాక్

షూటింగ్ స్పాట్‌కు వెళ్లి జైకి షాక్

అంతేకాకుండా పుట్టిన రోజున బెలూన్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లి జైకి షాకిచ్చింది. కేక్‌తోపాటు అంజలి షూటింగ్ స్పాట్ రావడంతో చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారట. యూనిట్‌ అందరి మధ్య జై బర్త్‌డేను సెలబ్రేట్ చేసి కేక్‌ తినిపించిందట. ఆ రోజంతా జైతోనే అంజలి గడిపిందట. షూటింగ్ స్పాట్‌లో నిజంగా భార్యాభర్తల్లాగే సన్నిహితంగా ఉన్నారట. హీరో జైతో పెళ్లికి అంజలి కుటుంబ సభ్యులు ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది. త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశముందనే వార్తలు జోరందుకున్నాయి.

 జై పాజిటివ్ గా

జై పాజిటివ్ గా

జై, అంజలి జంటగా నటించిన 'బెలూన్' చిత్రం ప్రమోషన్స్ సందర్బంగా వీరి ప్రేమ విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించారు. వారి ప్రశ్నలపై జై పాజిటివ్ గా స్పందించారు. ఇద్దరి మధ్య చాలా కాలం నుండి మంచి స్నేహం ఉందని, అంజలి అంటే తనకు చాలా ఇష్టమని, అంజలికి కూడా తానంటే ఇష్టమని జై చెప్పుకొచ్చారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్ (తెలుగులో 'జర్నీ') సమయంలోనే తమ స్నేహం మొదలైందని జై తెలిపారు.

అంజలికి కూడా తానంటే ఎంతో ఇష్టమని

అంజలికి కూడా తానంటే ఎంతో ఇష్టమని

ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉందని, అంజలి అంటే తనకు చాలా ఇష్టమని జై చెప్పాడు. అంతేగాకుండా అంజలికి కూడా తానంటే ఎంతో ఇష్టమని తెలిపాడు. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ సినిమాలో అంజలి తనను ఎప్పుడూ కొడుతూ ఉంటుందని, కానీ నిజ జీవితంలో మాత్రం తాను చాలా మృదుస్వభావి అని చెప్పాడు. అంజలికి ఎప్పుడైనా కోపం వచ్చినా, తను బాధలో ఉన్నా జోకులు చేస్తూ నవ్వించేస్తానని, అది అంజలికి చాలా నచ్చుతుందని చెప్పాడు.

English summary
The team BALLOON celebrated their hero Jai’s birthday on the sets of BALLOON in the presence of entire unit. Anjali, who plays a heroine in this film surprised Jai and the entire crew with her unexpected presence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu