twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడ హిట్...రేపటి నుంచీ చెన్నైలో రిలీజ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెద్ద హీరోల సినిమాలు సాధారణంగా ఆంధ్రా,చెన్నై లలో ఒకేసారి విడుదల చేస్తూంటారు. అయితే చిన్న సినిమాలు కేవలం ఇక్కడ మాత్రమే విడుదల చేస్తూంటారు. ఇక్కడ హిట్ అయితే చెన్నైలో తెలుగు వెర్షన్ విడుదల చేస్తూంటారు. ఇప్పుడు అలాగే అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన 'గీతాంజలి' ని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. అక్కడా మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'గీతాంజలి'. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్‌ సమర్పకులు.

    అంజలి మాట్లాడుతూ...''నా కెరీర్‌లో తొలిసారి డబుల్‌ రోల్‌ చేశాను. 'గీతాంజలి' హిట్‌ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాను'' అని అంజలి అన్నారు. ఆమె నటించిన 'గీతాంజలి' ఇటీవల విడుదలైంది బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రల్లో నటించారు.

    Anjali's Geetanjali in Chennai

    కోన వెంకట్‌ మాట్లాడుతూ ''కంటెంట్‌ సరైంది పడితే సినిమా హిట్‌ అని గీతాంజలి నిరూపించింది. మంచి టీమ్‌ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా. రాజ్‌కిరణ్‌ రాసుకున్న కథను తన అనుమతితో హారర్‌ కామెడీగా మార్చాను. వరుసగా సినిమాలు చేయాలన్న తాపత్రయం మాకు లేదు. మంచి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మా సంస్థ తదుపరి చిత్రం బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్‌తో ఉంటుంది'' అని తెలిపారు.

    గీతాంజలి జెన్యూన్‌, సిన్సియర్‌ హిట్‌ అని, టీమ్‌ చేసిన కృషికి ఫలితమే ఈ సినిమా సక్సెస్‌ అని బ్రహ్మానందం చెప్పారు. 50 రోజుల వేడుకలో మరిన్ని విషయాలు మాట్లాడతానని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

    ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, బ్రహ్మానందం, రావు రమేష్‌, మధునందన్‌, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కూర్పు: ఉపేంద్ర, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

    English summary
    After Success in Telugu States, Geethanjali releasing in Chennai Tomorrow
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X