»   » ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్న నాగార్జున

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్న నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అన్నపూర్ణ స్టూడియో ఓనర్ నాగార్జున కొత్తగా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అవతారం ఎత్తబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఆగస్టు 22న ఉదయం వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి పంపిణీ సంస్థ ప్రారంభం కానుంది.

నాగార్జున హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో నిర్మించిన 'భాయ్' చిత్రాన్ని వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. త్వరలోనే మిగిలిన ఏరియాల్లో కూడా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ శాఖలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 22న పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోస్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ శాఖను ప్రారంభిస్తున్నట్లు హీరో నాగార్జున తెలిపారు.

'భాయ్' మూవీ తెలుగుతో పాటు తమిళ అనువాదంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలోనూ ఈచిత్రాన్ని 'భాయ్' పేరుతోనే విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో వీరభద్రం దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'భాయ్'.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న 'భాయ్' సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

English summary
Nagarjuna owned Annapurna Studios is stepping into film distribution. Nagarjuna starrer Bhai, which also being produced by Annapurna Studios, is the first film that would be distributed by this new firm in Uttarandhra area. Operations will begin from August 22nd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu