»   » బాహుబలి రేంజిలో: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యుద్ధ సీన్లకు 8 కోట్లు!

బాహుబలి రేంజిలో: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యుద్ధ సీన్లకు 8 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య త్వరలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమా కాబోతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

  ఇప్పటి వరకు టాలీవుడ్లో భారీ సినిమా అంటే 'బాహుబలి' మాత్రమే. ఈ చిత్రంలో చూసిన యుద్ధ సన్నివేశాలు ఇప్పటి వరకు మనం ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు. ఇలాంటి సీన్లు చూసిన ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ రేంజికి తగ్గకుండా 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో యుద్ధ సన్నివేశాలు ఉండాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.

  యుద్ధ సన్నీవేశఆలకు సంబంధించిన షెడ్యూల్ 24 రోజులపాటు మొరాకోలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని తెలుస్తోంది. ఎనిమిది కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలను దాదాపు నాలుగు టన్నుల మెటీరియల్ తో తయారు చేయించారట.

  సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ఇందుకోసం 'బాహుబలి' సినిమాకు విజువల్ ఎపెక్ట్స్ అందించిన 'మకుట' సంస్థను దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయేలా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా క్రిష్ భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా సినిమా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారు.

  Another Bollywood Actor Joins The Cast Of Balayya's 100, Gauthamiputra Satakarni

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే 9 నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య తల్లి పాత్రలో బాలీవుడ్ నటి హేమా మాలిని తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇంకా అఫీషియల్ గా కరారు కావాల్సి ఉంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు కబీర్ బేడి కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

  ఈ నెల 9 నుండి మోరాకో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, 2 నుండి 3 వారాలు ఇక్కడ మేజర్ వార్ సీక్వెన్స్ మొదలవుతుందని నిర్మాత రాజీవ్ తెలిపారు. మొరాకో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టీం తిరిగి ఇండియా వస్తామని తెలిపారు. ఈ సినిమాకు హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. నయనతారను సంప్రదించాం. ఆమెకు ఇంట్రెస్టు ఉన్నా సెప్టెంబర్ వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవు. అప్పటి వరకు మేము ఆగదలుచుకోలేదు. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్ అవసరం ఉంటుంది. త్వరలోనే ఎవరో ఒకరిని ఖరారు చేస్తాం అని రాజీవ్ తెలిపారు.

  English summary
  Bollywood veteran actor Kabir Bedi, who has films such as Hulchal, Khoon Bhari Maang and Dilwale to his credit, has been roped in to play a crucial role in Nandamuri Balakrishna's highly anticipated 100th film, Gauthamiputra Satakarni. "Kabir Bedi plays a very important role and he will join the first schedule in Morocco, where we plan to shoot for about 2-3 weeks from May 9 onwards. In this schedule, one of three major war sequences of the film will be shot," film's producer Rajeev revealed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more