మోహన్‌బాబు పై మరో పిటీషన్

దేనికైనా రెడీ సినిమా కేసులో.. తనకు తెలియకుండా సినిమా టైటిల్స్‌లో పద్మశ్రీ వినియోగించారని మోహన్‌బాబు కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డి మరో పిటిషన్ వేశారు. స్పందించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని మోహన్‌బాబును ఆదేశించింది. ఝుమ్మందినాదం చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తూ నటించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో మంచు మనోజ్ హీరోగా చేసారు. తాప్సీ ఆ చిత్రంతో పరిచయం అయ్యింది.
మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద'. ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ''కథ, నటీనటులు... వీటి మీద నమ్మకంతో నేను సినిమాలు చేస్తూ వచ్చాను. నటుడిగా అయినా నిర్మాతగా అయినా నా పద్ధతి ఇదే. ఇలాగే ఆ రోజుల్లో 'పెదరాయుడు' సినిమాని చేశాను. కానీ ఆ సినిమా మీద నమ్మకం లేక విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేనే సొంతంగా విడుదల చేశాను. ఇప్పుడు 'పాండవులు పాండవులు తుమ్మెద'ని రూ.30 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాం. ఈ సినిమాని పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేను సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నాను. అప్పుడు 'పెదరాయుడు' ఎలా విజయం సాధించిందో... ఈ సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుంది'' అన్నారు మోహన్‌బాబు.


Click it and Unblock the Notifications











