For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనోభావాలు దెబ్బ : ‘గోపాల గోపాల’పై మరో కంప్లైంట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గోపాల గోపాల' చిత్రం హిట్ టాక్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మతానికి సంబందించిన కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఇప్పటికే ఈ చిత్రంపై కేసు వేసారు. అలాగే ఇప్పుడు కొంత మంది న్యాయవాదులు ఈ సినిమాని ఆపేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు.

  రీసెంట్ గా ఓ లాయర్ ‘గోపాల గోపాల' సినిమా ప్రదర్శన ఆపేయాలని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు. ఈ సినిమాలో లాయర్స్ మనోభావాలను దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేసారు.

  ఇంతకు ముందు ‘గోపాల గోపాల' సినిమాలో హిందు స్వామిజీలు, పీఠాధిపతులపై తీసిన సన్నివేశాలు హిందువులను మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ రఘునాథరావు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  ప్రముఖ హీరోలు వెంకటేష్, పవన్ కల్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' సినిమాపై వివాదాలు చెలరెగుతున్నాయి. సినిమాలో హిందువులను కించపరిచారంటూ విడుదలకు ముందే విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), బజ్‌రంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సినిమాకు సెన్సార్ సర్ట్ఫికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సెన్సార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

  ఈ తలనొప్పులు సినిమా విడుదలకు ముందు కూడా ‘గోపాల గోపాల' ఎదుర్కుంది. సినిమాను సెన్సార్ చెయ్యకూడదు అంటూ VHP మరియు బజరంగ్ దళాలనుండి బెదిరింపులు వచ్చాయి.

  Another complaint filed on ‘Gopala Gopala’

  కలెక్షన్స్ విషయానికి వస్తే...

  సంక్రాంతి పండుగ మూడు రోజులు హౌస్ ఫుల్ షోలతో థియేటర్ ల దగ్గర కళకళలాడుతుంది. గత శనివారం విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమా 18కోట్లను సంపాదించిపెట్టింది. ఈ కలెక్షన్ కేవలం ఆంద్ర, తెలంగాణాలో మాత్రమే కావడం మరో విశేషం.

  వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ మొదటిసారి కలిసి నటించిన ‘గోపాల గోపాల' . ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శనివారం (10వ తేదీ) విడుదలయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు. వెంకటేశ్‌ జోడీగా శ్రియ నటించింది. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలైంది.

  చిత్రం కథేమిటంటే...

  దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.

  దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.

  ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటించారు.

  English summary
  Another lawyer filed a police complaint against the screening of ‘Gopala Gopala’ and its makers at the Saroor Nagar Police Station. The complaint stated that certain scenes in the movie hurt sentiments of lawyers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X