»   » పూరీ జగన్నాధ్ చేయలేక చేతులు ఎత్తేసారు కానీ...

పూరీ జగన్నాధ్ చేయలేక చేతులు ఎత్తేసారు కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ మధ్యన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా పూరీ జగన్నాధ్ లోకనాయకుడు అనే చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. హీరో రాజశేఖర్ హీరోగా చేస్తున్నారని అన్నారు. జీవిత కూడా ఓ కీలక పాత్ర చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత పార్వతి మిల్టన్ ప్రదాన పాత్రలో ఛీఫ్ మినిస్టర్ రాజన్న అనే చిత్రం ప్రారంభిస్తామని ప్రకటన వచ్చింది. నేనే ముఖ్యమంత్రి నైతే అని చిత్రాన్ని నిర్మించి ఎలక్షన్ టైమ్ లో రిలీజ్ చేసిన ఎమ్.నరేంద్ర నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ప్రకటన చేసారు. 1975లో ఆయన రాజకీయ కెరీర్ ప్రారంభం నుంచి హెలీకాఫ్టర్ కూలటం వరకూ జరిగిన ముఖ్యమైన సంఘటనలతో ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. అదీ వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలతో గణేష్ లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై పి.రమణబాబు దర్శకత్వంలో 'రాజువయ్యా..మా రాజువయ్యా.." చిత్రం మొదలైంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌లో 30శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు పి.రమణబాబు, ఎం.రామకృష్ణ మాట్లాడుతూ-"ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీని చిత్రీకరించాం. రెండో షెడ్యూల్ ఈనెల మూడోవారంలో మొదలై కర్నూలు, కడప, పులివెందుల, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. వైఎస్ ‌ఆర్ క్యారెక్టర్ ‌లో రత్నారావు, రాజారెడ్డి పాత్రలో రంగనాథ్ నటిస్తున్నారు. వైఎస్ ‌ఆర్, జగన్ అభిమానుల సహకారంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలైలో వైఎస్ ‌ఆర్ జన్మదినోత్సవం రోజున విడుదల చేస్తాం" అని తెలిపారు. మరి ఇదన్నా పూర్తయ్యి రిలీజ్ కావాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu