»   » మహేశ్‌బాబు సినిమా పేరు ఇదేనా? తెరపైకి కొత్త టైటిల్!

మహేశ్‌బాబు సినిమా పేరు ఇదేనా? తెరపైకి కొత్త టైటిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ప్రిన్స్ మహేశ్‌బాబు కలయికలో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ మరొకటి తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో ఈ చిత్రానికి సంభవామి యుగే యుగే, అభిమన్యు, ఏజెంట్ శివ, మర్మం పేర్లు వెలుగులోకి వచ్చాయి.

తెరపైకి స్పైడర్

తెరపైకి స్పైడర్

తాజాగా ఈ చిత్రానికి స్పైడర్ అనే పేరు దాదాపు ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దానికి సంబంధించిన పోస్టర్ కూడా డిజైన్ చేశారు. అయితే ఆ పోస్టర్ చిత్ర నిర్వాహకులు చేశారా లేక ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనే విషయంపై క్లారిటీ లేదు.

వియత్నాంలో 22 నుంచి..

వియత్నాంలో 22 నుంచి..

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి 22వ తేదీ నుంచి వియత్నాంలో చేయనున్నట్టు సమాచారం. వియత్నాంకు వెళ్లడానికి ముందు చెన్నైలో మార్చి 11 నుంచి చిన్న షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు.

వచ్చే నెల టైటిల్, ఫస్ట్ లుక్

వచ్చే నెల టైటిల్, ఫస్ట్ లుక్

మహేశ్ బాబు కెరీర్‌లో 23వ చిత్రమైన ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను వచ్చే నెల ఆవిష్కరించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో రుకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ కాగా, ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా..

ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా..

ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భరత్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ కెమెరామెన్, దర్శకుడు సంతోష్ శివన్ తొలిసారి తెలుగులోకి ప్రవేశిస్తున్నారు. తుపాకి చిత్రం తర్వాత ఏఆర్ మురుగదాస్‌తో సంతోష్ శివన్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

English summary
The Chennai leg of the shoot of AR Murugadoss and Mahesh Babu’s untitled film will commence on March 11. Spider title Recently into media limelight. The film’s team plans to head for Vietnam from March 22 for a brief schedule.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu