»   » స్టైలిష్ స్టార్ కుమ్మేస్తున్నాడు:వసూళ్ళలో "సరైనోడు" ఇంకో రికార్డ్

స్టైలిష్ స్టార్ కుమ్మేస్తున్నాడు:వసూళ్ళలో "సరైనోడు" ఇంకో రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏదైనా సినిమాకు నెగిటివ్ టాక్ వ‌స్తే రెండో రోజుకే క‌లెక్షన్లు ప‌డిపోయే రోజులివి. కానీ స‌రైనోడు విష‌యంలో అలా జ‌ర‌గ‌ట్లేదు. సినిమాకు తొలి రోజు ఓకే అనిపించే టాక్ ద‌క్కింది. మాస్ ఆడియ‌న్స్ ను మాత్ర‌మే టార్గెట్ చేసిన ఈ చిత్రానికి క్లాస్ ప్రేక్ష‌కుల నుంచి అనుకున్న ఆద‌ర‌ణ రావ‌ట్లేదు. కానీ బి, సీ సెంట‌ర్ల‌లో మాత్రం స‌రైనోడు దుమ్ముదులిపేస్తున్నాడు.

తొలి రోజు 10 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన స‌రైనోడు.. తొలి వారం ప్ర‌పంచ వ్యాప్తంగా 45.72 కోట్లు వ‌సూలు చేసాడు. స‌రైనోడుతో బ‌న్నీ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్ కూడా వ‌చ్చి చేరిపోయింది. వ‌ర‌స‌గా నాలుగుసార్లు 40 కోట్లు దాటిన తొలి హీరోగా రికార్డ్ సృష్టించాడు బ‌న్నీ.


అందులో మూడు 50 కోట్ల సినిమాలున్నాయి. ఇక ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. నైజాంలో ఐదుసార్లు 10 కోట్ల మార్క్ అందుకున్న ఏకైక హీరో బ‌న్నీ మాత్ర‌మే. మ‌రే ఇత‌ర హీరోల‌కు మూడుకి మించి ఆ లెక్క దాట‌లేదు. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో కూడా 9.80 కోట్ల‌తో జ‌స్ట్ లో 10 కోట్ల మార్క్ మిస్సైంది. లేదంటే బ‌న్నీ ఖాతాలో ఆరు నైజాం 10 కోట్ల సినిమాలుండేవి.


Another record for Allu Arjun Sarainodu

సమ్మర్ సీజన్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా సరైనోడు. అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్, కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వందకోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ సరసన స్థానం సంపాదించిన ఈ సినిమా, 60 కోట్ల షేర్ తో బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.


ఇంకో అరుదైన రికార్డ్ సరైనోడి అకౌంట్లో పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సీడెడ్ లో 10 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. ఇంతకు ముందు మగధీర, అత్తారింటికి దారేది, బాహుబలి లాంటి పెద్ద సినిమాలు మాత్రమే రాయలసీమలో పది కోట్ల బిజినెస్స్ చేశాయి. అలాంటిది తాజాగా సరైనోడు సినిమాతో స్తైలిష్ స్టార్ అల్లు ఈ ఫీట్ ను సాధించాడు. అంతేకాదు ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్ దిశగా దూసుకుపోతున్నాడు.

English summary
Allu arjun Sarrainodu Record collections in ceded area after Rajamauli's Bahubali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X