»   » చేదుగానే ఉన్నా ఇదీ వాస్తవం... పవన్ కళ్యాణ్ ఈ ఫీట్ చేయగలడా?

చేదుగానే ఉన్నా ఇదీ వాస్తవం... పవన్ కళ్యాణ్ ఈ ఫీట్ చేయగలడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా హిట్ ఫట్ తో సంబందం లేకుండా పవన్ క్రేజ్ ఒక్క లాగే ఉంటుంది. అయితే సినిమా అనేది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో ముడిపడ్ద అంశం కాబట్టి అక్కడా సక్సెస్ అనేది ముఖ్యమే. అయితే అత్తారింటికి దారేది తర్వాత నుంచీ పవన్ మార్కెట్ బాగానే దేబ్బ తినింది. అటురాజకీయాల మీద ఇటు సినిమా మీదా దృష్టి పెట్తాల్సి రావటం తో పవన్ మీద ఒత్తిడి బాగా పెరిగింది. కారణాలేవైనా పవన్ మార్కెట్ ఇప్పుడు ఏమాత్రం బాగాలేదన్నది మాత్రం నిజం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం పట్టించుకోవాలి అదేమిటమంటే పవన్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రాజకీయంగా పెద్ద ప్రభావం పడటం లేదు గానీ ఆయన రాజకీయ జీవితం మాత్రం సినిమా మీద గట్టి ప్రభావాన్నే చూపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాబొతున్న కాటమరాయుడు మీద కూడా అభిమానులే 50-50 అన్న అభిప్రాయం లో ఉన్నారు. "సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవటం వల్లే తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా" అని తిరుపతి భహిరంగ సభలో పవన్ బహిరంగంగానే చెప్పినా, సినిమాలో దమ్ములేకపోతే కేవలం పవన్ కి కావాల్సిన నిధులకోసమే సినిమా చూడటం అన్నది కుదరని పని. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు "కాటమ రాయుదు తీసుకున్న నిర్ణయం వింటే ఇది జరుగుతుందా అనిపించక మానదు. నిజానికి పవన్ మాంచి స్వింగ్ లో ఉంటే ఈ టార్గెట్ పెద్ద కష్టమేం కాదు ఇంతకీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కలెక్షన్ ఎంతో తెలుసా??


నిజానికి సర్దార్ సినిమాతో 90 కోట్లు కలక్ట్ చేయాల్సి ఉన్నా కూడా.. సినిమా డిజాష్టర్ అవ్వడంతో అందరూ భారీగా నష్టపోయారు. కేవలం సర్దార్ ధియేట్రికల్ రైట్స్ ను 87 కోట్లకు కొనుక్కుంటే.. బాక్సాఫీస్ నుండి 52 కోట్ల షేర్ తో సరిపెట్టేశాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ''కాటమరాయుడు'' సినిమాను కూడా 87 కోట్లకు అమ్మేశారు. ఇది మామూలు టూమచ్ కాదు బాబోయ్. ఎందుకంటే ఆల్రెడీ లాసులను కవర్ చేయడానికి ఈ సినిమాను తీస్తే.. ఇప్పుడు ఈ సినిమాతో లాస్ రాకుండా చూసుకోవడం పెద్ద టార్గెట్ గా మారిపోయింది. ఒక భారీ హిట్టు టాక్ సాధిస్తే కాని.. ఈ పెట్టుబడి వసూలు అవ్వదు. ఇక ఈ పెట్టుబడి ఎప్పుడు వసూలు చేస్తారు.. మరి గత సినిమాలో పోయింది ఎప్పుడు రికవర్ చేసుకుంటారు? కాటమరాయుడుకే తెలియాలి.


Another Risky Betting on Pawan kalyan?

ఇప్పటికే సర్దార్ డిస్ట్రిబ్యూటర్లు పవన్ మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఈ సారి కూడా పవర్ స్టార్ సరైన హిట్ ఇవ్వలేక పోతే ఈ ప్రభావం తర్వాత ఆయన రాజకీయ జీవితం మీద కూడా పడే ప్రమాదం ఉంది. అసలు ''కాటమరాయుడు'' సినిమాను తీసిందే ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమాతో నష్టపోయిన పంపిణీదారులకు హెల్ప్ చేయడానికి. అటువంటిది ఇప్పుడు కాటమరాయుడు సినిమాను కూడా భారీ రేట్లకు అమ్మేస్తే.. రేపొద్దున్న తేడా వస్తే పరిస్థితి ఏంటి? బయ్యర్లను ముంచేసిన హీరో అంటూ ఇప్పటికే కొన్ని హెడ్దింగులను చూస్తూంటే బయట కూడా పవన్ ఇమేజ్ ఎంత దెబ్బ తింటోందో అర్థమవుతుంది. ఇక ఈ టార్గెట్ ని రీచ అయి మళ్ళీ తన సత్తా చాటాలని కోరుకోవటం తప్ప మనం మాత్రం చేయగలిగిందేముందీ...

English summary
Another Risky Betting on Pawan, Katamarayudu Pre-Release Business target is 90 crores
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu