»   » కన్‌ఫ్యూజన్‌లో మహేశ్‌బాబు ‘ఇంటెలిజెంట్’ సినిమా

కన్‌ఫ్యూజన్‌లో మహేశ్‌బాబు ‘ఇంటెలిజెంట్’ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఇటీవల ముంబైలో హీరో ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేశారు. మరో పక్క బ్యాంకాక్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

ఉగాదికి ఫస్ట్‌లుక్.. మే 31న పాటలు

ఉగాదికి ఫస్ట్‌లుక్.. మే 31న పాటలు

ఉగాది పండగ సందర్భంగా సినిమా పేరును, ఫస్ట్‌లుక్‌ని, మే 31న పాటల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇంటెలిజెంట్ సినిమాగా పేర్కొంటున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తున్నది.

మర్మం.. మరో టైటిల్ తెరపైకి

మర్మం.. మరో టైటిల్ తెరపైకి

ఈ చిత్రానికి ‘ఏజెంట్‌ శివ', ‘సంభవామి' అనే టైటిల్స్‌ పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మర్మం అనే మరోపేరు తెరమీదకి వచ్చింది. ఈ మూడు టైటిల్స్‌లో ఏదో ఒకటిని ఖరారు చేస్తారా? లేక వేరే టైటిల్‌ పెడతారా? అనేది వేచి చూడాల్సిందే.

జూన్ 23న చిత్రం రిలీజ్

జూన్ 23న చిత్రం రిలీజ్

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే జూన్ 23న తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని‘ఠాగూర్‌' మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్‌ జైరాజ్‌ సంగీతం, సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో విదేశీ భామలతో పాట చిత్రీకరణ

హైదరాబాద్‌లో విదేశీ భామలతో పాట చిత్రీకరణ

హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో మహేష్‌బాబు, విదేశీ భామలపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శోభి మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Prince Mahesh Babu Movie shooting going with Jet speed. Now This movie planning to shoot at Bangkok. Interesting news about this movie is Another title Maramam comes out. previously Agent Shiva, Sambavami names Under Consideration
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu