twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసభ్యంగా..అసహ్యంగా తయారైంది: అక్కినేని

    By Srikanya
    |

    ఈ మధ్య కాలంలో హాస్య హద్దులు దాటుతోందని, కొన్ని సందర్భాల్లో అది అసభ్యంగా..అసహ్యంగా ఉంటోందని దాదాసాహెబ్‌ఫాల్కేఅవార్డు గ్రహీత డా. అక్కినేని నాగేశ్వరరావు వాపోయారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) సౌజన్యంతో సమైక్యభారతి సమర్పణలో ప్రముఖ రంగస్థల, సినీ నటులు, రచయిత రావికొండలరావు హాస్య నాటకోత్సవాలు మంగళవారం రవీంద్రభారతి వేదికపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన అక్కినేని హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరసాల్లో 'శృంగారం' మానవ జన్మకు కారణమైతే.. 'హాస్యం' ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుందని, మిగితావి రసవత్తరమైన రసాలే అయినా.. అవి ఎప్పుడోగానీ మనల్ని తాకవన్నారు. కానీ శృంగారం, హాస్యం చివరి వరకు వెన్నంటే ఉంటాయని పేర్కొన్నారు. అయితే నేటి ఆధునిక యుగంలో హాస్యం హద్దులు దాటుతోందని, ఇది మంచి పరిణామం కాదని హెచ్చరించారు.

    అలాగే నాటక రంగాన్ని బతికించుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు తరచుగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభలో రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి, కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కార గ్రహీత డా.డి.విజయభాస్కర్‌, డిజిక్వెస్ట్‌ ఎండీ కె.బసిరెడ్డిలు అభినందనలు తెలిపారు. డా.ఓలేటి పార్వతీశం సభాసమన్వయకర్తగా వ్యవహరించారు. రావికొండలరావు, రాధాకుమారిలు పాల్గొన్నారు. అనంతరం యాబై ఏళ్ల క్రితం రావికొండలరావు రచించిన 'కథ కంచికి' నాటికను ఆయన సతీమణి రాధాకుమారి దర్శకత్వంలో చక్కగా ప్రదర్శించారు. ప్రతి సన్నివేశం హాస్యాన్ని పండించింది. కథ కంచికి నాటికలో నాటకాల కాంట్రాక్టర్‌, దర్శకుడు పాత్రధారి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

    English summary
    Akkineni Nageswara Rao attended Hasya Natakotsavam function as chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X