twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు క్యాన్సర్ ఉంది, మీడియా మీట్లో బాంబు పేల్చిన అక్కినేని

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 90 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా ఉంటూ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఉన్న సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు అభిమానులను ఈ విషయం కాస్త బాధించే విషయమే. అయితే వేరొకరి ద్వారా ఈ విషయం తెలిసి అభిమానులు బాధ పడకుండా ఉండేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు....ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు.

    అక్కినేని మాట్లాడుతూ...'నాకు అక్టోబర్ 8న కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం క్యాన్సర్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వృద్ధాప్యంలో క్యాన్సర్ కణాలు చురుకుగా ఉండవని వైద్యులు చెప్పారు. కాబట్టి ఈ వయసులో క్యాన్సర్ రావడం సంతోషించదగ్గ విషయం. నాకు క్యాన్సర్ ఉన్న విషయం తెలిపేందుకే ఈ మీడియా సమావేశం' అని తెలిపారు.

    స్లైడ్ షోలో అక్కినేని మీడియా సమావేశానికి సంబంధించిన ఫోటోలు, అక్కినేని చెప్పిన వివరాలు...

    అక్కినేని ప్రెస్ మీట్-1

    అక్కినేని ప్రెస్ మీట్-1

    ‘నేను నటించిన సినిమాల్లో చూపినట్లు ఇదేమీ భయంకరమైన జబ్బు కాదు. క్యాన్సర్‌ను జయించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. విజయవంతంగా జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారిలో నేనూ ఒకరిని కావొచ్చేమో. నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే...మిత్రులు, అభిమానులు, శ్రేభిలాషులు బాధపడకుండా, ఈ విషయమై నన్ను అడిగి అడిగి ఇబ్బంది పెట్టకుండా, నాతో ఎప్పుడూ నవ్వుతూ గడపాలని కోరుకుంటున్నాను' అన్నారు నాగేశ్వరరావు.

    అక్కినేని ప్రెస్ మీట్-2

    అక్కినేని ప్రెస్ మీట్-2

    ‘1984లో హార్ట్ ఎటాక్ వచ్చింది. ఎక్కువ కాలం బ్రతకరు అన్నారు వైద్యులు. నా మనో బలం, అభిమానుల ఆశీర్వాద బలం వల్లనే ఇంత కాలం బ్రతికాను. ఇప్పటి వరకు సినిమాల్లో అనేక ముఖ్య పాత్రలు పోషించాను. 90 ఏళ్ల జీవితంలో 74 సంవత్సరాలు కళాకారుడిగా కళకళలాడాను' అన్నారు.

    అక్కినేని ప్రెస్ మీట్-3

    అక్కినేని ప్రెస్ మీట్-3

    ‘నాతో పాటు నా కుటుంబం కూడా సినీరంగానికే అంకితమై పని చేస్తున్నాం. నాకొడుకులు, కూతుర్లు, వాళ్ల పిల్లలు ఇలా అందరూ సినిమాలకు అంకితమైన వాళ్లే. నాకు ఇంత మంచి జీవితం ప్రసాదించిన ఈ సినిమా తల్లికి కృతజతలు తెలుపుకోవడం నా ధర్మం' అక్కినేని అన్నారు.

    అక్కినేని ప్రెస్ మీట్-4

    అక్కినేని ప్రెస్ మీట్-4

    ‘74 ఏళ్ల సినీ ప్రస్తానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా పాల్కే అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పశుబతి వెంకయ్య అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి అన్నాదురై అవార్డు, అమెరికా, యూరఫ్, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వివిధ దేశాల్లో లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు...ఇలా ఎన్నో అవార్డులు ఇచ్చారు. నా జీవితం ఇలా ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. 90 సంవత్సరాల్లో 74 ఏళ్లు సినిమాల్లో పని చేయడం ప్రపంచంలో ఒక రికార్డు అని తేలింది. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. క్యాన్సర్ వచ్చిందని నటన ఆపను. ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటాను' అన్నారు ఏఎన్ఆర్.

    అక్కినేని ప్రెస్ మీట్-5

    అక్కినేని ప్రెస్ మీట్-5

    మా అమ్మ 96 ఏళ్లు జీవించింది. మా అమ్మలాగా నేను కూడా 96 ఏళ్లు జీవిస్తాననే నమ్మకం ఉంది. అభిమానుల ఆశీర్వాదం ఉంటే తప్పుకుండా సెంచరీ పూర్తి చేసి మళ్లీ ఇలా మీతో సమావేశం అవుతా అని నాగేశ్వరరావు అన్నారు. మరి మన సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్‌ను జయించి...నూరేళ్లుకు మించి జీవించాలని ఆకాంక్షిద్దాం....

    English summary
    Veteran Actor Akkineni Nageswara Rao had revealed a shocking news to Press a short while ago. He revealed that doctors found cancer in his body at an early stage. Talking in a press meet, he said that he do not want press to start rumours about his health and revealed it himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X