»   » బ్రహ్మానందం కే వేటు పడింది

బ్రహ్మానందం కే వేటు పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన 'ఆటోనగర్ సూర్య' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడం, సెకండాఫ్‌‍లో అనవసర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడటంతో వెంటనే దర్శక నిర్మాతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సినిమా సెకండాఫ్‌లో అక్కర్లేని సీన్లు లేపేసి 12 నిమిషాల నిడివి తగ్గించారు. ట్రిమ్ చేసిన సినిమానే నిన్నటి నుండి అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే బ్రహ్మానందం పాటను తొలిగించారు. ఈ విషయాన్ని దర్శకుడు దేవకట్టా ఖరారు చేసారు. దేవకట్టా ట్వీట్ చేస్తూ... 'ట్రిమ్ చేసిన వెర్షన్ లో బ్రహ్మానందం పాట ఉండదు " అన్నారు.

దేవా కట్టా మాట్లాడుతూ - ''నాగచైతన్య చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇది. నాగచైతన్య నటన బాగుందని, తన కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా నిడివి ఎక్కువైందనే అభిప్రాయం వెలువడటంతో, సెకండాఫ్ లో 12 నిమిషాలు ట్రిమ్ చేశాం. నిడివి తగ్గింది కాబట్టి, సినిమా స్పీడ్ గా సాగుతుంది. ట్రిమ్డ్ వెర్షన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది'' అని చెప్పారు.

ANS not to have the following scenes!

అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''నాగచైతన్య నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. నాగచైతన్య కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సాధించింది. 'మనం' తర్వాత నాగచైతన్య సాధించిన మరో సూపర్ హిట్ మూవీ ఇది'' అన్నారు.

ఈ చిత్రంలో నాగచైతన్య, సమంత, సాయికుమార్‌, కిమాయా, బ్రహ్మానందం, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, దువ్వాసి మోహన్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తదితరులునటించారు.

బ్యానర్: మ్యాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా. నిర్మాత: కె.అచ్చిరెడ్డి సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌.

English summary
Deva Katta tweeted 'In trimmed version you won't find Brahmanandam song".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu