»   » నా చెల్లెళ్లని టచ్ చేయొద్దు..జాన్వీ, ఖుషిని ట్రోల్ చేసిన వ్యక్తికి అన్షుల వార్నింగ్

నా చెల్లెళ్లని టచ్ చేయొద్దు..జాన్వీ, ఖుషిని ట్రోల్ చేసిన వ్యక్తికి అన్షుల వార్నింగ్

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం తరువాత బోణి కపూర్ ఫ్యామిలి ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీదేవి వివాహం చేసుకున్న కారణంగా బోనికపూర్ మొదటి భార్య ఫ్యామిలీ అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. చివరకు బోనికపూర్ కొడుకు కూతురు అర్జున్ కపూర్, అన్షుల కూడా అతడికి దూరంగా ఉంటూ వచ్చారు. కాగా శ్రీదేవి మరణం తరువాత అన్న చెల్లెల్లు ఇద్దరూ తండ్రికి చేరువ అవుతున్నారు. కేవలం తండ్రికి మాత్రమే కాదు శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషిని కూడా వారు ఇప్పుడు ప్రేమ భావంతో చూస్తున్నారు. బోనికపూర్ నలుగురు సంతానం అన్నా చెల్లెళ్లుగా కలసిపోతున్నారు. శ్రీదేవి అంత్య క్రియల్లో అర్జున్ కపూర్ అంతా తానై చూసుకున్న సంగతి తెలిసిందే. అన్షులా జాన్వీ, ఖుషిని ఓదార్చి వారికి చేరువ అయింది.

శ్రీదేవి ముఖాన్నిచూసి టీవీ కట్టేశాను....
ఫ్యామిలీ కలిసిపోయే సూచనలు

ఫ్యామిలీ కలిసిపోయే సూచనలు

శ్రీదేవితో వివాహం తరువాత బోని కపూర్ మొదటి భార్య ఫ్యామిలీ మొత్తం అతడిని దూరం పెట్టింది. కనీసం శ్రీదేవితో ఆమె పిల్లలతో మాట్లాడడానికి కూడా వారు ఇష్టపడేవారు కాదు. కానీ శ్రీదేవి మరణం తరువాత వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరిగింది.

 తల్లిలేని పిల్లల కోసం

తల్లిలేని పిల్లల కోసం

శ్రీదేవి మరణం తరువాత జాన్వీ, ఖుషి ఇద్దరూ తల్లిలేని పిల్లలుగా మారిపోయారు. వారి తల్లి మరణించి తల్లడిల్లుతున్న వారి భాదకు ప్రముఖులంతా చలించిపోయారు.

 ఆ బాధ అర్జున్, అన్షులకు తెలుసు

ఆ బాధ అర్జున్, అన్షులకు తెలుసు

తల్లి లేని బాధ ఎలా ఉంటుందో అర్జున్ కపూర్, అన్షుల అనుభవించారు. శ్రీదేవి మరణంతో తన ఫ్యామిలీని చేరదీయడానికి అర్జున్ కపూర్, అన్షుల జాన్వీ, ఖుషికి చేరువ అవుతున్నారు.

 అంత్యక్రియల్లో అన్ని తానై

అంత్యక్రియల్లో అన్ని తానై

ఎన్ని గొడవలు ఉన్నా కుటుంబ బంధాలు, ఎమోషన్స్ కి భారతీయలు ఎవరైనా తలొగ్గుతారు. శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్, బోనికపూర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరిగింది. శ్రీదేవి అంత్యక్రియల్లో అర్జున్ కపూర్ అన్ని తానై నడిపించిన విధానానికి బోనికపూర్ ప్రశంసలు కురిపించారు.

పిల్లర్లుగా మారారు

పిల్లర్లుగా మారారు

శ్రీదేవి మరణించి దుఃఖంలో ఉన్న తనకు, తల్లిని కోల్పోయి తల్లడిల్లుతున్న జాన్వీ, ఖుషికి అర్జున్ కపూర్, అన్షుల అందించిన ఓదార్పు మరిచిపోలేనిదని బోనికపూర్ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. తమకు వారిద్దరూ పిల్లర్లుగా మరి సహకారం అందించారని బోని తెలిపారు.

ఇది మరో నిదర్శనం

ఇది మరో నిదర్శనం

అర్జున్ కపూర్, అన్షుల..శ్రీదేవి పిల్లలకు బాగా చేరువయ్యారు అనడానికి ఇది మరొక నిదర్శనం. ఇటీవల ఓ వక్తి సోషల్ మీడియాలో జాన్వీ, ఖుషిని ట్రోల్ చేస్తూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కు అన్షులా ఘాటుగా రియాక్ట్ కావడం విశేషం.

నా చెల్లెళ్లని టచ్ చేయొద్దు

నా చెల్లెళ్లని టచ్ చేయొద్దు

జాన్వీ, ఖుషిని ట్రోల్ చేస్తూ పెట్టిన కామంట్ కు అన్షులా ఇచ్చిన సమాధానం తెగ ఆకట్టుకుంది. జాన్వీ, ఖుషిని నా చెల్లెళ్లు అంటూ సంభోధించింది. నా చెల్లెళ్ళ పట్ల అసభ్యంగా వ్రవర్తించవద్దు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

 అన్న కూడా సహించరు

అన్న కూడా సహించరు

జాన్వీ, ఖుషిని ట్రోల్ చేస్తూ కామెంట్ పెట్టిన వ్యక్తి అర్జున్ కపూర్ అభిమాని కావడం గమనార్హం. అన్షులా స్పందిస్తూ ఇలాంటి చర్యలని మా అన్న కూడా సహించరని వార్నింగ్ ఇచ్చింది.

English summary
Anshula gives strong warning to man who is abused Janhvi and khushi. She told that dont abuse my sisters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu