»   » రేష్మి ‘అంతం’ పెద్దలకు మాత్రమే, ఊహకందని రీతిలో..

రేష్మి ‘అంతం’ పెద్దలకు మాత్రమే, ఊహకందని రీతిలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీవీ యాంకర్ నుండి హీరోయిన్ గా మారిన రేష్మి.... తొలి సినిమా గుంటూరు టాకీస్ తో తన అందాల ప్రదర్శన, రొమాంటిక్ సీన్లతో హైలెట్ అయింది. అయితే ఈ సినిమాలో ఆమెకు నటన పరంగా నిరూపించుకునే అవకాశం దక్కలేదు.

రేష్మి ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం 'అంతం' జులై 7 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన ఈ చిత్రం ట్రేడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం, మెత్తం రెండు రాష్ట్రాల‌కి ఫ్యాన్సి రేట్ కి బిజినెస్ చేయ‌టం విశేషం.

రేష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న అద్బుత‌మైన పాత్ర‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి అడల్ట్ సర్టిఫికెట్(పెద్దలకు మాత్రమే) 'A' ఇచ్చారు. స్లైడ్ షోలో సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలు, ఫోటోస్..

హాటు, ఘాటు..

హాటు, ఘాటు..

కథ పరంగా సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హింసాత్మక సన్నివేశాలు ఉండటం వల్లనే అడల్ట్ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.

సస్పెన్స్ థిల్లర్

సస్పెన్స్ థిల్లర్

దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా ‘అంతం' చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను.

గ్లామర్

గ్లామర్

గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రేష్మీ గౌతమ్ మా చిత్రంలో గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చిందని కళ్యాణ్ తెలిపారు.

క్రేజ్ ఉంది

క్రేజ్ ఉంది

ఈ చిత్రం చూసిన త‌రువాత హీరోయిన్ ర‌ేష్మి అంద‌మైన ఫెర్‌ఫార్మెన్స్ గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతారు. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో సిని ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది.

అన్నీ

అన్నీ

థ్రిల్ మాత్రమే కాకుండా నవ రసాలు ఈ చిత్రంలో పొందుప‌రిచాము. త‌ప్ప‌కుండా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకుంటుంది అన్నారు దర్శకుడు.

రెస్పాన్స్

రెస్పాన్స్

మాలాంటి చిన్న చిత్రాన్ని ఇండ‌స్ట్రి పెద్ద‌లు ఆశీర్వ‌దించినందుకు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. మేము విడుద‌ల చేసిని ట్రైల‌ర్ కి హ్యుజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషమని చెప్పుకొచ్చారు నిర్మాత.

రిలీ డేట్

రిలీ డేట్

A సర్టిఫికెట్ పొందిన మా అంతం చిత్రాన్ని జులై 7 న విడుద‌ల చేయ‌నున్నామని దర్శక నిర్మాత తెలిపారు.

నటీనటులు

నటీనటులు

రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్
సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్

English summary
Rashmi Gautam's Antham 2016 latest romantic suspense thriller movie Antham gets A certificate, film release on 7 July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu