For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంత‌రిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ రివ్యూ: టాలీవుడ్‌లో మొట్టమొదటి స్పేస్ మూవీ

  |

  విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకొంటూ హిట్లు కొడుతున్న మెగా హీరో వరుణ్ తేజ్. ఇతర హీరోలకు భిన్నంగా సినిమా సినిమాకు వేరియేషన్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. ఫిదాలో ఎన్నారైగా, తొలిప్రేమలో ప్రేమికుడిగా కనిపించిన వరుణ్ తేజ తాజాగా అంతరిక్షం అనే చిత్రంలో నటించాడు. టాలెంటెడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ, గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఘాజీ లాంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలోని ప్రధాన అంశాలు మీకోసం..

  టాలీవుడ్ చరిత్రలోనే

  టాలీవుడ్ చరిత్రలోనే

  తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష నేపథ్యంతో వస్తున్న చిత్రం అంతరిక్షం. పూర్తిగా సైంటిఫిక్ కథాంశంతోపాటు ఓ చిన్న ప్రేమకథ, దేశభక్తి తదితర అంశాలతో రూపొందింది. ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. పార్వతి పాత్రలో గెస్ట్‌గా లావణ్య త్రిపాఠి.

  స్పేస్ పాలిటిక్స్ ఓ అంశంగా

  స్పేస్ పాలిటిక్స్ ఓ అంశంగా

  అంతరిక్ష పరిశోధనలో భాగంగా స్పేస్ సైంటిస్టుల మధ్య ఉండే పాలిటిక్స్‌ను ఓ అంశంగా తెరకెక్కించారు. కానీ అది ప్రధాన అంశంగా మాత్రం కాదు అని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఇతర సైంటిస్ట్ పాత్రల్లో సత్యదేవ్, తదితరులు నటించారు.

  అదితిరావు హైదరీ సైంటిస్టుగా

  అదితిరావు హైదరీ సైంటిస్టుగా

  అంతరిక్షం మూవీలో స్పేస్ సైంటిస్టుగా అదితిరావు హైదరీ కనిపిస్తారు. సమ్మోహనం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన అదితిరావు మరోసారి ఫెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం కోసం రోప్ టెక్నాలజీలో శిక్షణ పొందారు. పాత్ర కోసం చాలా సమస్యలను అధిగమించారు.

  జీరో గ్రావిటేషన్‌తో

  జీరో గ్రావిటేషన్‌తో

  అంతరిక్షం నేపథ్యంగా రూపొందడంతో జీరో గ్రావిటేషన్ వాతావరణంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అదితిరావు మెడలో గాయం కావడంతో కొన్ని రోజులు బెడ్‌కే పరిమితమయ్యారు. ఈ సినిమా కోసం బల్గేరియాకు చెందిన స్టంట్ కోరియోగ్రాఫర్లు పనిచేశారు.

  హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా

  హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా

  హాలీవుడ్‌లో రూపొందిన గ్రావిటీ, అపోల్ 13 లాంటి సినిమాల మాదిరిగానే ఓ థ్రిల్లర్‌గా అంతరిక్షం ఉంటుంది. సెకండాఫ్‌లో పూర్తిగా స్పేస్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. క్లైమాక్స్‌లో ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టి సినిమాను చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

  రామకృష్ణ, మోనికా ఆర్ట్ వర్క్ గురించి

  రామకృష్ణ, మోనికా ఆర్ట్ వర్క్ గురించి

  అంతరిక్షం సినిమాకు స్పేస్ బ్యాక్ డ్రాప్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నది. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన ఈచిత్రానికి రామకృష్ణ సబ్బాని, మోనిక నిగోట్రే ఆర్ట్ వర్క్ చేశారు. వీరిద్దరూ రంగస్థలం సినిమాకు అందించిన ఆర్ట్ వర్క్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. వీరి పనితీరు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

  క్రిష్, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతగా

  క్రిష్, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతగా

  అంతరిక్షం చిత్రాన్ని క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై క్రిష్‌ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ప్రశాంతి విహారి సంగీతం అందించారు. గుణశేఖర్ సినిమాటోగ్రఫి, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

  English summary
  Ghazi Fame director Sankalp Reddy is coming up with yet another spunky attempt by titled as Anthariksham, the film has Varun Tej, Lavanya Tripati and Aditi Rao Hydari in the lead roles. Sankalp Reddy revealed that the idea of making Anthariksham came to his mind after going through a newspaper article about space. This movie set to release on December 21st.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X