»   » ఎఫ్‌టిఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్

ఎఫ్‌టిఐఐ చైర్మన్‌గా అనుపమ్ ఖేర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టిఐఐ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న టెలివిజన్ నటుడు గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్ నియమితులయ్యారు.

Anupam Kher

పుణె కేంద్రంగా నడిచే ఎఫ్‌టిఐఐకి గజేంద్ర చౌహాన్‌ చైర్మన్‌గా నియమితులైనప్పటి నుండి వివాదం కొనసాగుతోంది. రాజకీయ పరమైన కారణాలతో ఆయన్ను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు వ్యతిరేకించారు. గజేంద్ర చౌహాన్‌కు వ్యతిరేకంగా గతేడాది ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు 139 రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో ఆయన పదవి నుంచి వైదొలగారు.

అనుపమ్ ఖేర్ విషయానికొస్తే... బాలీవుడ్ సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. 500కు పైగా సినిమాల్లో నటించారు. గతంలో ఆయన సీబీఎఫ్‌సీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్లుగానూ వ్యవహరించారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

ఎఫ్‌టిఐఐలోనే అనుపమ్ ఖేర్ చదివడం గమనార్హం. తాను చదివిన సంస్థకే చైర్మన్ కావడం పట్ల ఖేర్ ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన మనసుతో సంస్థలోకి వెళ్తానని, తాను చేయగలిగినంత చేస్తానని చెప్పారు.

English summary
The government on Wednesday appointed Anupam Kher as chairman of Film and Television Institute of India (FTII), Pune. Anupam Kher will replace Gajendra Chauhan, whose turbulent tenure ended in March this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu