»   » ‘మన్మోహన్ సింగ్’ బయోపిక్‌లో అనుపమ్ ఖేర్

‘మన్మోహన్ సింగ్’ బయోపిక్‌లో అనుపమ్ ఖేర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది. మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ ఖరారు చేసారు.

2004 నుండి 2008 మధ్యకాలంలో మన్మోహన్ మీడియా అడ్వైజర్ గా పని చేసిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద బుక్... 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 2018 డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

రాజకీయ లబ్ది కోసమే?

రాజకీయ లబ్ది కోసమే?

రాజకీయ లబ్దికోసమే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లక్ష్యంగా ఈ సినిమా తెరెకెక్కబోతున్నట్లు టాక్.

అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్

అనుపమ్ ఖేర్ బిజేపీ పార్టీకి మద్దతుదారు. ఆయన భార్య కిర్రన్ ఖేర్ బీజేపీ లీడర్. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పీఎం అయిన మన్మోమన్ సింగ్ పాత్రను పోషించబోతుండటం చర్చనీయాంశం అయింది.

సినిమాలో ఏం ఉండబోతోంది?

సినిమాలో ఏం ఉండబోతోంది?

మన్మోమన్ సింగ్ ప్రధాని కావడానికి కారణమైన పరిస్థితులు.... ప్రధాని అయిన తర్వాత మన్మోహన్ ఎదుర్కొన్న పరిణామాలు సినిమాలో చూపించబోతున్నారు.

దర్శకత్వం

దర్శకత్వం

నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘షాహిద్' చిత్రానికి దర్శకత్వం వహించిన హన్సల్ మెహతా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ రత్నాకర్ అనే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

English summary
Actor Anupam Kher has been finalised to play the role of former prime minister Manmohan Singh in an upcoming film based on the book written by Singh’s former media adviser, Sanjay Baru. While the book, The Accidental Prime Minister: The Making and Unmaking of Manmohan Singh, was released just before the 2014 general election, the movie is set to release just before the 2019 general election.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu