»   »  అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, కౌంటర్స్

అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, కౌంటర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇప్పుడు అంతటా అమీర్ ఖాన్ తాజా వ్యాఖ్యలపై మండిపాటు, వ్యాఖ్యానాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ సాక్షిగా అమీర్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  ‘భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోంది’ అంటూ అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై నటుడు అనుపమ ఖేర్ స్పందించారు. ఆయన ఇలా ట్వీట్ చేసారు.

మరో ప్రక్క ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు. అమీర్ కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్విట్ చేశారు. ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Anupam Kher questions Aamir Khan's statement on 'intolerance'

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు. ఎంత పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని అమీర్ కు ఆయన సూచన చేశారు.

అమీర్ ప్రకటన షాక్ కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.

English summary
Anupam Kher questions Aamir Khan's statement on 'intolerance'. He tweeted "Dear aamir_khan. Did you ask Kiran which country would she like to move out to? Did you tell her that this country has made you AAMIR KHAN".
Please Wait while comments are loading...