For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ వీపు మీద ఆ హీరోయిన్ల చేతిగుర్తులు: రంగుతో అద్దేసారు, సినిమా కోసం కాదు

  |

  ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు తారలు సినిమా ప్రమోషన్స్ కోసం ఇతర రియాల్టీ షోలను, టాక్ షోలను, ఒక్కోసారి టీవీ సీరియళ్ళను కూడా బాగా యూస్ చేసుకుంటున్నారు.అటు సినిమా పూర్తవుతూనే రకరకాల షోలల్లో అటు టీమ్ తోనూ ఇటు సింగిల్ గానూ ఇంటర్వ్యూలూ, గేమ్ షోలూ అంటూ బుల్లితెరమీదకి వచ్చేస్తున్నారు.

  Filmibeat Top 10 ఫిల్మిబీట్ టాప్ టెన్..
  ఉన్నది ఒకటే జిందగీ

  ఉన్నది ఒకటే జిందగీ

  రీసెంట్ గా రామ్ కూడా "ఉన్నది ఒకటే జిందగీ" సినిమా ప్రమోషన్ కోసం ఒక టాక్ షోకి వెళ్లి అక్కడ హంగామా చేసి షోకే హైప్ క్రియేట్ చేశాడు. రామ్ ఒక్కడే కాదు సినిమాలో హీరోయిన్లు గా చేసిన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌లు కూడా రావటం తో ఇక షో దద్దరిల్లినట్టే అయిపోయింది... మొత్తానికి బాగానే ఆకట్టుకున్నారు...

  అక్టోబర్ 27న విడుదల

  అక్టోబర్ 27న విడుదల

  రామ్, లావణ్య త్రిపాఠి, అనుపమలు నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం అక్టోబర్ 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వీరు ఈ షోలో సినిమాని ప్రమోట్ చేసేందుకు వచ్చి, సరదాగా సినిమాకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ షోలో రామ్ కి ఒక ప్రశ్న ఎదురైంది. ఇంటర్వ్యూ చేయాలంటే ఎవరి చేస్తారంటే.. బాలయ్య ను చేస్తానని చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ క్లిప్పింగ్ వీడియో వైరల్ అయ్యింది.

  అరచేతి గుర్తులు

  అరచేతి గుర్తులు

  అయితే షో అయిపోయాక మాత్రం ఈ ఇద్దరి ముద్దుగుమ్మల అరచేతి గుర్తులు మాత్రం రామ్ వీపుమీద పడ్దాయ్... అంటే కొట్టటం వల్ల కాదులెండి ఈ షోలో పాల్గొన్న వారంతా చివరిలో వెళ్లేటప్పుడు వారి చేతిని రంగులో ముంచి, ఆ రంగు చేతిని పేపరుపై ముద్రగా వేసి గ్యాలరీలో పెట్టాలి. అయితే అనుపమ, లావణ్యలు మాత్రం వారి చేతి ముద్రలను ఇలా రామ్ షర్ట్‌పై కూడా వేసారు. ఎంతైనా పాపలు వేసిన ముద్రలు కదా రామ్ కూడా సంతోషంగానే ఉన్నాడు...

   మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి

  మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి

  'నేను శైల‌జ'.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అనుభూతిని మిగిల్చింది. ఆహ్లాద‌క‌ర‌మైన కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమా.. ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న యువ క‌థానాయ‌కుడు రామ్‌ని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన 'హైప‌ర్' మాత్రం స‌ద‌రు యంగ్ హీరోని నిరాశ‌ప‌రిచింది.

  కిషోర్ తిరుమ‌ల‌తోనే

  కిషోర్ తిరుమ‌ల‌తోనే

  ఇప్పుడు మ‌ళ్లీ 'నేను శైల‌జ' ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌తోనే "జింద‌గీ'తో మళ్ళీ ఒక హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు రామ్.. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే కొన్నాళ్ళ పాటు రామ్ కెరీర్ ఒడిదుడుకుల్లోంచి బయట పడ్డట్టే, ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నాళ్ళైనా "మినిమం" గ్యారెంటీ అనే జోన్ లోకి మాత్రం రాలేకపోయిన ఈ హీరో ఈ సినిమా తో అయినా ఒక గాడిలో పడతాడేమో చూడాలి.

  English summary
  Lavanya Tripathi and Anupama Parameshwaran decided to leave a mark on Ram's shirt in a fun way. Three of them, went on to Anchor Pradeep's show for the promotions of their upcoming movie, Vunnadi Okkate Zindagi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X