మెగా హీరోతో మళ్ళీ మలయాళీ పిల్లే.. అతడి దర్శకత్వంలో రొమాన్స్‌కు రెడీ!
మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ టాలీవుడ్ లో జోరందుకుంది. వరుస అవకాశాలతో అనుపమ దూసుకుపోతోంది. ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ తెలుగులో అ.. ఆ, శతమానం భవతి వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజు సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.
తేజు, అనుపమ నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా మరో మారు సాయిధరమ్ తేజ్, అనుపమ రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ తదుపతి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించబోతున్నాడు. కథ ప్రకారం అనుపమ హీరోయిన్ అయితే బావుంటుందని భావించిన దర్శకుడు ఆమెని ఎంపిక చేశాడు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది
saidharamtej anupama parameswaran kalyani priyadarshan kishore tirumala సాయిధరమ్ తేజ్ అనుపమ పరమేశ్వరన్ కళ్యాణి ప్రియదర్శన్


Click it and Unblock the Notifications