»   » అనుపమ వివాదాస్పద ట్వీట్‌.. రామ్ చరణ్‌ టార్గెట్ చేసిందా?: అసలేం జరిగింది

అనుపమ వివాదాస్పద ట్వీట్‌.. రామ్ చరణ్‌ టార్గెట్ చేసిందా?: అసలేం జరిగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్ తో చేసిన 'అ ఆ' , నాగచైతన్యతో చేసిన 'ప్రేమమ్' సినిమాలతో కుర్రాళ్లు గుండెళ్లో తిష్ట వేసిన అనుపమ పరమేశ్వరన్, రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శతమానం భవతి' సినిమాతోను అందరి మనసులను దోచేసింది.

అదే ఊపులో రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో నూ, నాని, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందే సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలవలేదు. ఆమెను ఆ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పించారని సమాచారం. అందుకు కారణం ...ఆమె తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేయటమే అని చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో నిజం ఎంత ఉన్నా, ఇప్పుడామె ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారటానికి మరో కారణం ఉంది.

Anupama Parameswaran tweet-Ram Charan's film controversy

అనుపమను తప్పించి వేరే కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతున్నారని వార్తలు మీడియాలో వచ్చాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ మాత్రం ఆ వార్తకు బలం చేకూరుస్తోంది. పైగా, ఆ ట్వీట్‌ రామ్‌చరణ్‌ను, సుకుమార్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌లా కనిపిస్తోందంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే..

'ఒక్కసారి నేను వెనక్కి చూసుకుంటే.. గతంలో నేను తిరస్కరణకు గురైన ప్రతీ సందర్భంలోనూ నాకు మంచే జరిగింది. ఇలా తిరస్కరణకు గురైన ప్రతీసారీ నేను మరింత అభివృద్ధి సాధిస్తున్నాన'ని ట్వీట్‌ చేసింది అనుపమ. అనుపమ చేసిన ఈ ట్వీట్‌ లో ఉన్న అసలు విషయం ఏమిటనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
"As I look back on my life, I realize that every time I thought I was being rejected from something good, I was actually being re-directed to something better". Anupama Parameswaran sharing this quote as an oblique reference to how losing the Ram Charan-Sukumar movie may well lead to betterment
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu