»   » 'అరుంధతి' హిందీ రీమేక్ డైరక్టర్ ఖరారు

'అరుంధతి' హిందీ రీమేక్ డైరక్టర్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎట్టకేలకు 'అరుంధతి' చిత్రం త్వరలో హిందిలో రీమేక్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్సకుడు అనురాగ బసు తెరకెక్కించనున్నారు. అనురాగ బసు గతంలో గ్యాంగస్టర్, లైఫ్ ఇన్ మెట్రో, కైట్స్ చిత్రాలు డైరక్ట్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని త్రీడీలో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు ఈ చిత్రాన్ని భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో ప్లాన్ చేస్తున్నారు.

త్రీడిలో అయితే మరింత హారర్ గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు. ఇక ఈ విషయమై శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...ఈ చిత్రం హిందీలో కూడా పెద్ద విజయం సాధిస్తుందని, తెలుగు చిత్రాన్ని బీట్ అవుట్ చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఇక ఈ చిత్రం సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఎంపిక ఇంకా పూర్తికాలేదు. అనూష్క, సోనూసూద్ కూడా వారి స్టార్ కాస్టింగ్ లెక్కల్లో ఉన్నారు. ఇక ఇప్పటికే అనూష్క ప్లేసులో అసిన్, ఐశ్వర్య రాయ్, విధ్యాబాలన్ పేర్లు వినిపించాయి.

English summary
Arundhati film’s Hindi remake rights were bought by Gemini Film Circuit. After several rounds of discussions, they have got one of the top directors, Anurag Basu on board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu