»   » ఆమెతో అఫైర్ నిజమే.. చాటింపు వేయాలా? మూడో పెళ్లికి ప్రముఖ దర్శకుడు సిద్ధం..

ఆమెతో అఫైర్ నిజమే.. చాటింపు వేయాలా? మూడో పెళ్లికి ప్రముఖ దర్శకుడు సిద్ధం..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anurag Kashyap opens Up About Shubhra Shetty

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఫాంథమ్ ఫిల్మ్స్ అసోసియేట్ శుభ్రశెట్టి మధ్య అఫైర్ నడుస్తుందనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్న సంగతి తెలిసిందే. 45 ఏళ్ల అనురాగ్, 23 ఏళ్ల శుభ్ర గురించి, వారి మధ్య రొమాన్స్ గురించి కథలు, కథలుగా రాశారు. అయితే తమ అఫైర్‌పై అనురాగ్ గానీ, శుభ్ర గానీ పెదవి విప్పలేదు. అయితే తాజాగా శుభ్రతో తన రిలేషన్‌ను అనురాగ్ కశ్యప్ పంచుకొన్నారు. మూడో పెళ్లికి సిద్ధపడుతున్న ఆయన ఏమి చెప్పారంటే..

 శుభ్ర శెట్టితో డేటింగ్‌కు ముందు

శుభ్ర శెట్టితో డేటింగ్‌కు ముందు

శుభ్రతో డేటింగ్‌కు ముందు ఆర్తీ బజాజ్, బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్‌తను అనురాగ్ వివాహం చేసుకొన్నారు. ఆర్తీని 2003లో వివాహం చేసుకొని ఆమె నుంచి 2009లో విడాకులు తీసుకొన్నారు.

 కల్కి కోచ్లిన్‌తో రెండో పెళ్లి

కల్కి కోచ్లిన్‌తో రెండో పెళ్లి

ఆ తర్వాత బాలీవుడ్ నటి కల్కితో ప్రేమలో పడ్డాడు. 2011లో కల్కితో వివాహం జరిగింది. వ్యక్తిగత విభేదాల కారణంగా 2015లో వారిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే.

 కల్కి కోచ్లిన్‌తో స్నేహ సంబంధాలు

కల్కి కోచ్లిన్‌తో స్నేహ సంబంధాలు

కల్కితో సంబంధాల గురించి అనురాగ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులం. ఆమెతో నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పారు.

 శుభ్రశెట్టితో సహజీవనం

శుభ్రశెట్టితో సహజీవనం

శుభ్రశెట్టితో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నా. నా డేటింగ్ గురించి, గానీ ఆమెతో అఫైర్ గురించి చాటింపు వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అది మా వ్యక్తిగత విషయం. ప్రతీ ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం లేదు అని ఓ ప్రశ్నకు అనురాగ్ సమాధానం ఇచ్చాడు.

 90 ఏళ్ల వయసులో కూడా

90 ఏళ్ల వయసులో కూడా

జీవితంలో ఏదో సమయంలో ప్రతీ ఒక్కరికి ప్రేమ అవసరం. ప్రేమలో ఉండే ఎమోషన్స్‌ నాకు చాలా ఇష్టం. 90 ఏళ్ల సమయంలో కూడా ప్రేమలో పడుతాను. ప్రేమిస్తాను అని అనురాగ్ తన మనసులో భావాలను పంచుకొన్నాడు.

 కల్కి విషయంలో తప్పది

కల్కి విషయంలో తప్పది

తన కారణంగానే కల్కికి సినీ పరిశ్రమలో అవకాశాలు వస్తున్నాయనే మాటను అనురాగ్ ఖండించాడు. ఇండస్ట్రీలో చాలా మందికి తమకు సంబంధించిన విషయాలపై కంటే.. ఇతరుల జీవితంపైనే ఎక్కువ దృష్టిపెడుతారు. వారిపై కామెంట్లు చేస్తారు అని అనురాగ్ అన్నారు.

రాంగోపాల్ వర్మతో అనురాగ్ కశ్యప్

రాంగోపాల్ వర్మతో అనురాగ్ కశ్యప్

అనురాగ్ కశ్యప్ ఏది చేసినా దాని వెనుక సంచలనం దాగి ఉంటుంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ శిష్యుడు. వారిద్దరి మధ్య మంచి గాఢమైన అనుబంధం ఉంది. పబ్లిక్‌గా వర్మతో అనురాగ్ ముద్దులు పెట్టుకొంటూ ఇలా ఫొజిచ్చారు. అప్పట్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
Rumours suggest that, Anurag Kashyap dating his associate at Phantom Films, Shubhra Shetty, began doing the rounds. Rumours of the 45-year-old director living with his 23-year-old girlfriend surfaced back in 2015. Kalki and Anurag were married from 2011 to 2015. Before that, Kashyap was married to Aarti Bajaj, from 2003 to 2009.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu